తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దాదాపుగా పూర్తి చేసింది. 45 మందితో రెండో జాబితాను విడుదల చేసింది. మరో 19 మంది అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను మాత్రం ఇంకా వెల్లడించలేదు. వాటిలో నాలుగు స్థానాలను సీపీఐ, సీపీఎంలకు కేటాయించనుంది. ఇక, మిగిలిన 15 స్థానాలకు సంబంధించిన క్యాండిడేట్స్ ను మాత్రం వివిధ కారణాలతో పెండింగ్ లో పెట్టింది. ఇక, మిర్యాలగూడ, కొత్తగూడెం, వైరా, చెన్నూరు, నిజామాబాద్ అర్బన్, బాన్సువాడ, జుక్కల్, కామారెడ్డి, సిరిసిల్ల, సూర్యాపేట, తుంగతుర్తి, చార్మినార్, పటాన్ చెరువు, కరీంనగర్, ఇల్లందు, డోర్నకల్, సత్తుపల్లి, అశ్వారావుపేట, నారాయణ్ ఖేడ్ సీట్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ పెండింగ్‌లో ఉంది.
Read Also: Karnataka Minister: కర్ణాటక పేరును బసవనాడుగా మార్చడంలో తప్పులేదు..
ఇక, ఈ 19 సీట్లలో కొత్తగూడెం, వైరా సీట్లను సీపీఐకు, మిర్యాలగూడ, చెన్నూరు సీట్లను సీపీఎంకు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ రెడీ అయినట్లు తెలుస్తుంది. అయితే, కేసీఆర్, కేటీఆర్, బండి సంజయ్ పోటీ చేస్తున్న కామారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్ సీట్లలోనూ బలమైన అభ్యర్థులను దింపాలని కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. అటు పటాన్ చెరువు నుంచి బీఎస్ తరపున సీటు ఆశించిన నీలం మధు ముదిరాజ్ కాంగ్రెస్‌లో చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఈ సీటును పెండింగ్‌లో పెట్టారని తెలుస్తుంది. ఇక సూర్యాపేట సీటు కోసం మాజీ మంత్రి దామోదర్ రెడ్డి, పటేల్ రమేశ్ రెడ్డి మధ్య పోటీ తీవ్రంగా ఉండటంతో దాన్ని కూడా పెండింగ్‌లో పెట్టారు. తుంగతుర్తి సీటు విషయంలోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది.
Read Also: Mahesh Babu: తల్లి చివరి కోరిక నెరవేర్చబోతున్న మహేష్.. ?
అయితే, మిగతా సీట్ల విషయంలోనూ ముఖ్య నేతలు తమకు సన్నిహితుల పేర్లను ప్రతిపాదించడంతో ఆయా సీట్లను కాంగ్రెస్ నాయకత్వం వెయిటింగ్ లిస్ట్ లో పెట్టింది. ఇక, ప్రస్తుతం ప్రకటించిన సీట్లతో పోల్చితే.. పెండింగ్‌లో పెట్టిన సీట్ల సంఖ్య నామమాత్రమే.. ఇక ఈ పరీక్ష పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. దీంతో అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ తగ్గించి.. ప్రచారంపై పూర్తి స్థాయిలో ముందుకు పోయేలా కాంగ్రెస్ నేతలు రెడీ అవుతున్నారు.