* నేడు ఉదయం 10 గంటలకు ప్రజాభవన్ లో ప్రజాదర్బార్
* నేడు విద్యుత్, ఆర్టీసీపై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ.. సీఎంతో సమావేశం కానున్న ఆర్టీసీ ఎండీ.. మహిళలకు ఉచిత ప్రయాణంపై నేడు మార్గదర్శకాలు.. రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితులపై ఆశాఖ ఉన్నతాధికారులతో సెక్రటేరియట్ లో సమావేశం.. విద్యుత్ శాఖ రివ్యూకు ట్రాన్స్ కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు హాజరు కావాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం..
* నేడు తిరుపతి, బాపట్ల జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ పర్యటన.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పంట నష్టాలకు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ పరిశీలించనున్న సీఎం జగన్
* నేడు సుప్రీం కోర్టులో చంద్రబాబు కేసు విచారణ.. ఏపీ హైకోర్టు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు ఇచ్చిన బెయిల్ ను సవాలు చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన సీఐడీ.. కేసు విచారణ జరపనున్న జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం
* నేడు పలాసలోని ప్రగతి భవన్ అవరణంలో రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో పలాస నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం
* నేడు ఏలూరు జిల్లాలో బీజేపీ రాష్ట్రఅధ్యక్షురాలు పురంధేశ్వరి పర్యటన.. ఉంగుటూరు నియోజకవర్గం పుళ్ళ, కైకరం గ్రామాలలో మీచౌంగ్ తుఫాన్ ప్రభావం వల్ల పంట నష్టపోయిన రైతులు పరామర్శించనున్న పురందేశ్వరి..
* నేడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పనున్న చంద్రబాబు.. నందివెలుగు, కూచిపూడి లాకులు, అమృతలూరు, ఉత్తర పాలెం మీదుగా కర్లపాలెం మండలం పాత నందాయపాలెం చేరుకోనున్న చంద్రబాబు..
* నేడు నెల్లూరు జిల్లాలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గూడూరు డివిజన్ లో ముఖ్యమంత్రి జగన్ తో కలిసి పర్యటిస్తారు..
* నేడు నెల్లూరు నగరంలోని పాత సంతపేట కార్యాలయంలో పర్యటించనున్న మాజీ మంత్రి నారాయణ.. నెల్లూరులోని టీడీపీ కార్యాలయంలో కోవూరు నేతల సమావేశం
* నేడు ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదంలో బోట్లు కోల్పోయిన మత్య్సకారులకు టీడీపీ పరిహారం.. ఒక్కో బోటుకు లక్ష చొప్పున అందజేయనున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చన్నాయుడు, మాజీమంత్రి కొల్లు రవీంద్ర..
* నేడు విశాఖపట్నంలో ఆర్కే బీచ్ లో నేవీ డే సన్నాహాలు.. పూర్తిస్థాయి యుద్ధ విన్యాసాలను రిహార్సల్ చేయనున్న నేవీ సిబ్బంది.. మూడు రోజుల పాటు అమల్లోకి రానున్న ట్రాఫిక్ ఆంక్షలు.. స్కై లాంప్స్, డ్రోన్లు, గాలిపటాలు ఎగుర వేయడంపై నిషేధం.. మధ్యాహ్నం నుంచి రాత్రి 8గంటల వరకు ఆర్కే బీచ్ రోడ్డులో పాస్ లు కలిగిన వాహనాలు మినహా సాధారణ ట్రాఫిక్ దారి మళ్లింపు..
* శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో స్పీకర్ తమ్మినేని సీతారం.. సరుబుజ్జిలి మండలం సింధువాడ సచివాలయం పరిధిలోని మూల సవలాపురం, తురకపేట, వ్యాసుల పేట గ్రామలలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటారు.. మధ్యాహ్నం 3 గంటలకు ఆమదాలవలస ఎస్ ఎస్ ఎన్ కల్యాణ మండపంలో సోషల్ మీడియా తో ఆత్మీయ సమావేశంలో పాల్గొననున్న స్పీకర్ తమ్మినేని సీతారం
* నేడు స్పల్పంగా పెరిగిన బంగారం ధర, తగ్గిన వెండి ధర.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57, 550.. 54 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 62, 780..