తెలుగు రాష్ట్రాల్లో చలిగాలుల తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. ఉదయం తొమ్మిది గంటలు దాటినా... మంచు తగ్గడం లేదు. ప్రజలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. హైదరాబాద్లో చలిగాలులు విపరీతంగా వీస్తున్నాయి. దీంతో ప్రజలు శ్వాసకోశ ఇబ్బందులను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు.
సచివాలయంలో తెలంగాణ ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రిగా జూపల్లి కృష్ణారావు భాద్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు ఎంత సంతోషంగా ఉందో.. ఇప్పుడు అంతకు రెట్టింపు సంతోషం ఉందని తెలిపారు. ప్రజాస్వామ్యం ఫరిడవిల్లాలి.. నీళ్లు నిధులు, నియామకంతో పాటు ఆత్మగౌరవం ముఖ్యమేనని మంత్రి పేర్కొన్నారు. అంతేకాకుండా.. నియంత పాలన, డిక్టేటర్ పాలన పోయింది.. రాష్ట్ర ప్రజలు తెలంగాణ ఇచ్చిన సోనియా రుణం తీర్చుకున్నారని తెలిపారు.
తెలంగాణలో పలు కార్పొరేషన్ ఛైర్మన్ల నియామకాలను ప్రభుత్వం రద్దు చేసింది. అందుకు సంబంధించి ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 54 మంది నియామకాలు, పదవీ కాలం పొడిగింపును తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. కాగా.. డిసెంబర్ 7న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరగా, అప్పటి నుంచి గత ప్రభుత్వ హయాంలో నియమితులైన ప్రభుత్వ సలహాదారుల నియమకాలను కూడా ప్రభుత్వం రద్దు చేసింది. తాజాగా 54 కార్పొరేషన్ల ఛైర్మన్ నియామకాలు రద్దు చేసింది.
నేడు సంగారెడ్డి జిల్లాలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటన. జోగిపేటలో మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలను ప్రారంభించనున్న మంత్రి దామోదర రాజనర్సింహ
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. తమకు వచ్చిన ఓట్లు, సీట్లు చూస్తే రాబోయే కాలంలో బీజేపీ తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో అధికారం సాధించే దిశలో పయనిస్తుందని తెలిపారు. డబ్బు, మద్యం ప్రభావంను పక్కన పెట్టి ప్రజలు బీజేపీకి విజయాన్ని కట్ట బెట్టారని అన్నారు. బీజేపీకి ఓటు వేసిన ప్రజలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు శాతం…