AP CM YS Jaganmohan Reddy: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. కాలు తుంటి ఎముక ఫ్రాక్చర్ కావడంతో హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో శస్త్ర చికిత్స పొందుతున్నారు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి సీఎం జగన్ ఆరా తీశారు.
Read Also: Free Bus Services: ఆర్టీసీ మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై మార్గదర్శకాలు ఇవే..
కేసీఆర్ తనయుడు, మాజీ మంత్రి కేటీఆర్‌కు సీఎం జగన్ ఫోన్ చేశారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి ఏపీ సీఎం తెలుసుకున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి జగన్ ఆకాంక్షించారు.