నేడు ఉదయం జ్యోతిరావు పూలే భవన్ లో ప్రజాదర్బార్.. ప్రజాసమస్యలపై చర్చ
ఇవాళ ఉదయం 10 గంటలకు జ్యోతిరావు పూలే భవన్‌లో ప్రజా దర్బార్ నిర్వహించనున్నానని ప్రలందరూ ఆహ్వానితులే అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.. కాగా.. ప్రగతి భవన్.. జ్యోతిరావు పూలే భవన్ లో ప్రజాభవన్‌గా మారిన విషయం తెలిసిందే. ప్రజా భవన్ గేట్లు తెరిచి ఉన్నాయి. దశాబ్దం తర్వాత సామాన్యుడి అడుగులు పడిపోయాయి. నేడు ప్రజాభవన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రజా సమస్యలను సీఎం రేవంత్ స్వయంగా పరిష్కరిస్తారు. సీఎంగా పాలనా పగ్గాలు చేపడుతూ రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ బేగంపేటలో ముఖ్యమంత్రి అధికార నివాసం ప్రగతి భవన్ ఎదుట రోడ్డుపై వేసిన ఇనుప కంచెను తొలగించాలని ఆదేశించారు. ప్రమాణస్వీకారం అనంతరం అదే వేదికపై నుంచి ప్రగతి భవన్ కంచెను తొలగిస్తామని రేవంత్ ప్రకటించారు. ఒకవైపు రేవంత్ ప్రమాణస్వీకారం, మరోవైపు ముఖ్యమంత్రి అధికార నివాసం ముందున్న కంచె తొలగింపు ఒకేసారి జరిగాయి.
రేపటి నుంచే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
రేపటి నుంచి సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీల్లో రెండింటిని ప్రభుత్వం అమలు చేస్తుందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఆర్టీసి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ హామీని రూ.10 లక్షల పెంపుతో పాటు అమలు చేస్తామని ఆరోగ్యశ్రీ ప్రకటించింది. డిసెంబర్ 9 నుంచి ఆధార్ కార్డు ఉన్న ప్రతి మహిళ ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చని స్పష్టం చేశారు. ఈ రెండు హామీలకు కేబినెట్ ఆమోదముద్ర వేయగా, శుక్రవారం ఆయా శాఖల అధికారులతో సమీక్షిస్తానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మరోవైపు ఎల్లుండి అసెంబ్లీ సమావేశం జరుగుతుందని శ్రీధర్ బాబు తెలిపారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, ప్రొటెం స్పీకర్ ఎన్నిక ఉంటుందని తెలిపారు. ప్రొటెం స్పీకర్‌ను గవర్నర్ నియమించిన తర్వాత… ఎమ్మెల్యేల చేతుల మీదుగా ప్రమాణం చేయిస్తారని చెప్పారు. ఆ తర్వాత స్పీకర్ ఎన్నిక, గవర్నర్ ప్రసంగం ఉంటుందని శ్రీధర్ బాబు తెలిపారు.
కాలు జారిపడ్డ కేసీఆర్.. తుంటి ఎముక విరగడంతో..
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గాయపడ్డారు. దీంతో వెంటనే సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. అయితే గురువారం అర్ధరాత్రి కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌లో జారి పడిపోయినట్లు సమాచారం. దీంతో మాజీ సీఎం కేసీఆర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గురువారం కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌లోని అర్ధరాత్రి బాత్‌రూమ్‌లో జారి పడిపోయినట్లు సమాచారం. బాత్ రూమ్ కు వెళుతుండగా కేసీఆర్ పంచె కాలుకు తగిలి కిందికి పడిపోయినట్లు విశ్వనీయ సమాచారం. ఈ క్రమంలో కేసీఆర్ ఎడమకాలు తుంటి ఎముక విరిగిపోయినట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు సమాచారం. దీంతో కుటుంబసభ్యులు హుటాహుటిని సోమాజిగూడలోని యశోదకు ఆస్పత్రికి అర్థరాత్రి తరలించారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ప్రర్యటన
నేడు వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటించనున్నారు. తొలుత తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డి పాలెం వెళ్లనున్న జగన్.. అక్కడ స్వర్ణముఖి నది కట్ట తెగి నష్టపోయిన ప్రాంతాలను పరిశీలిస్తారు. ఆ తర్వాత బాపట్ల జిల్లా మరుప్రోలువారిపాలెం వెళ్లనున్నారు.. అక్కడ తుఫాన్ బాధితులతో సీఎం నేరుగా మాట్లాడనున్నారు. అనంతరం కర్లపాలెం మండలం పాతనందాయపాలెం చేరుకుని బాధిత రైతులను పరామర్శించనున్నారు. అక్కడి నుంచి బుద్దాంలో దెబ్బతిన్న వరి పంటను పరిశీలించి రైతులతో సమావేశం కానున్నారు సీఎం జగన్. ఇక, ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఉదయం 8.50 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి చేరుకుని అక్కడి నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. 10 గంటలకు ప్రత్యేక హెలికాఫ్టర్‌లో కోట మండలం విద్యానగర్‌కు వెళ్లనున్నారు. అక్కడి నుంచి 10.30 గంటలకు రహదారి మార్గంలో వాకాడు మండలం బాలిరెడ్డిపాలెంలో దెబ్బతిన్న స్వర్ణముఖి రివర్ బ్యాంక్‌ను సీఎం జగన్ పరిశీలిస్తారు.
నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ
ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో సీఐడీ అధికారులు పిటీషన్ దాఖలు చేసింది. ఈ పిటీషన్ పైన నేడు ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరగనుంది. గతంలో విచారణ సమయంలో ఇరు పక్షాలు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు గురించి ఎలాంటి బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ఇక, ఏపీ హైకోర్టులో బెయిల్ మంజూరు చేయటం పైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ సీఐడీ తరపున ముఖుల్ రోహిత్గీ వాదనలు వినిపించారు. కాగా, దీంతో సుప్రీం కోర్టు ఏ నిర్ణయం వెలడిస్తుంది అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ పైన విచారణ పూర్తైంది. తీర్పును న్యాయస్తానం రిజర్వ్ చేసింది. ఆ తీర్పు ఇప్పుడు చంద్రబాబు కేసులకు కీలకం కాబోతుంది. అయితే, టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో 53 రోజులు రాజమండ్రి జైలులో రిమాండ్ లో ఉన్నారు. బెయిల్ వచ్చినా.. అనారోగ్య కారణాలతో రెస్ట్ తీసుకున్నారు.
మెక్సికోలో భూకంపం.. వణికిపోయిన భవనాలు.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.8
మెక్సికో సిటీలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.8గా నమోదైంది. భూకంపం సమయంలో మెక్సికో సిటీలోని భవనాలు కంపించాయి. అయితే ఈ భూకంపం వల్ల ఎలాంటి నష్టం వాటిల్లినట్లు సమాచారం లేదు. ఇంతకు ముందు కూడా ఇక్కడ భూకంపం సంభవించింది. దేశంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్మోలజీ ప్రకారం.. గురువారం మధ్యాహ్నం సెంట్రల్ మెక్సికోలో రిక్టర్ స్కేలుపై 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం ధాటికి మెక్సికో సిటీలోని భవనాలు కంపించాయి. మీడియా నివేదికల ప్రకారం.. భూకంపం తరువాత, ప్రజలు భవనాల నుండి బయటకు వచ్చి వీధుల్లో గుమిగూడారు.
జోధ్‌పూర్ నుండి ఎద్దుల బండ్ల మీద 600 కిలోల నెయ్యి.. కంబోడియా నుంచి పసుపు
అయోధ్య రాములోరి ఆలయ నిర్మాణానికి భక్తులు భారీ విరాళాలు ఇవ్వడంతో పాటు వారి చేతనైనంత చేయూతను అందిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం నాడు ఆలయంలో రామలాల వ్రతం, నిత్య జ్యోతి ప్రజ్వలన కోసం ఆరు వందల కిలోల ఆవు దేశీ నెయ్యిని విరాళంగా అందజేశారు. విశేషమేమిటంటే, ఈ నెయ్యిని 108 కలశంలో నింపి ఐదు ఎద్దుల బండ్లలో మహర్షి సాందీపని రామ్ ధరమ్ గోశాల, బనాద్, జోధ్‌పూర్ నుండి ఇక్కడకు తీసుకువచ్చారు. నవంబర్ 27న జోధ్‌పూర్ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర పదవ రోజైన గురువారం కరసేవకపురం చేరుకుంది. శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్‌కి మహర్షి సాందీపని మహారాజ్ ఈ నెయ్యి కలశం సమర్పించారు. మహారాజ్ సాందీపని మొదట్లో ఒక కుండలో నెయ్యి సేకరిస్తున్నట్లు చెప్పాడు. వేడికి నెయ్యి కరగడంతోపాటు కుండ కూడా పగుళ్లు రావడం మొదలైంది. నెయ్యి కూడా ఒక్కసారి చెడిపోయింది.
ఎక్స్ట్రాడినరీ మాన్ ట్విటర్ రివ్యూ..
యంగ్ హీరో నితిన్ చెక్, మ్యాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం సినిమాలతో… గత రెండేళ్లుగా యంగ్ హీరో నితిన్ ఫ్లాప్స్ ఇస్తూనే ఉన్నాడు. మధ్యలో రంగ్ దే కాస్త పర్వాలేదనిపించింది కానీ సాలిడ్ హిట్ గా నిలబడలేదు. ఈసారి మాత్రం యావరేజ్ కాదు హిట్ కొట్టాల్సిందే అంటూ ఎంటర్టైన్మెంట్ ని నమ్ముకోని ఆడియన్స్ ముందుకి వస్తున్నాడు నితిన్. భీష్మ సినిమాలో బాగా నవ్వించిన నితిన్… ఈసారి ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ సినిమాతో కూడా నవ్వించడానికి ఆడియన్స్ ముందుకి వచ్చాడు. ఎన్నో హిట్ సినిమాలకి రైటర్ గా కథలు అందించి ‘నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా’ సినిమాతో దర్శకుడిగా మారిన వక్కంతం వంశీ, నితిన్ ని ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ చేసేసాడు. 2022 ఏప్రిల్ లోనే అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ సినిమా ఈరోజు ఆడియన్స్ ముందుకి వచ్చింది. టీజర్, ట్రైలర్ తో పాజిటివ్ వైబ్ జనరేట్ చేసిన ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ సినిమాకి షోస్ ఆల్రెడీ కొన్ని సెంటర్స్ లో పడిపోయాయి. సోషల్ మీడియాలో ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ సినిమా గురించి మిక్స్డ్ రివ్యూస్ కనిపిస్తున్నాయి.