తెలంగాణలో డ్రగ్స్ మాట వినపడొద్దు అని తెలిపారు. డ్రగ్స్ నిర్మూలనకు ఏది కావాలంటే అది చేస్తాం.. నార్కోటిక్ బ్యూరోపై పోలీసు అధికారులతో సమీక్షలో కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆక్టోపస్ గ్రేహౌండ్స్ లాగా నార్కోటిక్ టీమ్ ని బలోపేతం చేస్తాం.. డ్రగ్స్ నిర్మూలించి దేశానికి తెలంగాణ పోలీస్ రోల్ మోడల్ గా నిలవాలి అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీ పదవికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నన్ను ఎంపీగా ఎన్నుకున్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మీరు నన్ను ఎంపీగా ఎన్నుకుని నాకు పునర్జన్మ ఇచ్చారు.. ఎప్పటికీ భువనగిరి ప్రజలకు రుణపడి ఉంటాను అని వెంకట్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్ సోమాజీగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రిని కేసీఆర్ ను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ కోలుకోవడానికి 6 నుంచి 8 వారాల సమయం పడుతుందని వైద్యులు చెప్పారని ఆయన తెలిపారు.
సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎంకేసీఆర్ను తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అక్కడి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.
కాంగ్రెస్ అంటేనే కరప్షన్ పార్టీ.. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 5 నెలలు కాలేదు అని కిషన్ రెడ్డి తెలిపారు. కానీ, 5 ఏండ్లకు సరిపడా వ్యతిరేకతను మూటగట్టుకుంటోంది.. ఛత్తీస్ గఢ్ లోన అవినీతి ఎక్కువైనందునే ఆ పార్టీని ఓడించారు.
ఇవాళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరుస రివ్యూలతో సెక్రటేరియట్లో బిజీబిజీగా ఉన్నారు. నేడు ఉద్యోగాల భర్తీపై ఆయన రివ్యూ చేశారు. పూర్తి వివరాలతో రావాలని టీఎస్పీఎస్సీ అధికారులను సీఎం ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భర్తీ చేసిన ఉద్యోగాల వివరాలతో పాటు నోటిఫికేషన్ల వివరాలతో రావాలని సీఎం ఆదేశించారు.