Minister Ponnam Prabhakar Visits Husnabad Govt Hospital: ఏ సమస్యలు ఉన్నా మధ్యవర్థుల ప్రమేయం లేకుండా ప్రజలు నేరుగా తనను కలవవచ్చు అని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. రాజకీయాలకు అతీతంగా హుస్నాబాద్ అభివృద్ధి కోసం కలిసికట్టుగా పని చేస్తా అని హామీ ఇచ్చారు. హుస్నాబాద్‌లో మెడికల్ కళాశాల ఏర్పాటుకు స్థల సేకరణ జరుగుతోందని, కేంద్రీయ విద్యాలయం కోసం ప్రయత్నం చేస్తున్నాను అని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
‘నేను ఎంపీగా ఉన్న సమయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నాలుగు మున్సిపలిటీలు ఏర్పాటు చేశాం. హుస్నాబాద్‌లో మెడికల్ కళాశాల ఏర్పాటు కోసం స్థల సేకరణ జరుగుతోంది. హుస్నాబాద్‌లో కేంద్రీయ విద్యాలయం కోసం ప్రయత్నం చేస్తున్నాను. హుస్నాబాద్ పట్టణంలోని వార్డుల్లో సమస్యలు తెలుసుకోని.. పరిష్కారమార్గం చూపెడతాం. రాజకీయాలకు అతీతంగా హుస్నాబాద్ అభివృద్ధి కోసం కలిసి కట్టుగా పని చేస్తా. ఏ సమస్యలు ఉన్నా మధ్యవర్థుల ప్రమేయం లేకుండా ప్రజలు నేరుగా నన్ను కలవవచ్చు. గౌరవెల్లి భూ నిర్వాసితుల సమస్యలు తెలుసుకోని.. వాటిని పరిష్కరించి సాధ్యమైనంత త్వరగా గౌరవెల్లి ప్రాజెక్టును అందరి సమక్షంలో ప్రారంభించుకుందాం’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
Also Read:
మున్సిపల్ కార్యాలయంలో సమీక్ష సమావేశం అనంతరం హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు. ఆసుపత్రి వార్డుల్లో ఉన్న రోగులను ఆయన పరామర్శించారు. అక్కడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.