Praja Bhavan: ప్రజావాణికి భారీగా జనం.. భూ సమస్య, పెన్షన్ల పై ఫిర్యాదులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Praja Bhavan: ప్రజా వాణి కి భారీగా జనం క్యూ కట్టారు. మంగళ.. శుక్రవారంలో ప్రజావాణి నిర్వహించాలని సీఎం నిర్ణయించిన విషయం తెలిసిందే.. తమ సమస్యలను చెప్పుకునేందుకు భారీగా ప్రజలకు తరలివస్తున్నారు. ప్రజా వాణికి మంత్రులు వచ్చారు. ఫిర్యాదులు స్వీకరణ.. సమస్య తీవ్రతబట్టి అధికారులకు ఆదేశాలు జారీ చేయనున్నారు. ఫిర్యాదుల్లో భూ సమస్య..పెన్షన్ల ల కోసం వస్తున్న ప్రజలే ఎక్కువగా మంది రావడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఉదయం 5 గంటలకే ప్రజాభవన్ ముందు క్యూ కట్టారు. ఈ క్యూ తొమ్మిది గంటలకు కిలోమీటరుకు పైగా పెరిగింది. వారిని క్రమపద్ధతిలో నిలువరించి ఒక్కొక్కరిగా లోపలికి పంపడం పోలీసులకు కష్టసాధ్యంగా మారుతోంది.
Read also: Shankar Naik: ఆ కొడుకులను వదిలిపెట్టేది లేదు.. స్వామిమాల వేసుకుని శంకర్ నాయక్ మాటలు
Also Read
- Bhatti Vikramarka : కరెంట్ డిమాండ్‌లో బిగ్ రికార్డ్.. 20 వేల మెగావాట్లకు చేరిక.!
- Asaduddin Owaisi : ఓట్ల తొలగింపుపై ఒవైసీ ఫైర్.. సెక్రటేరియట్లో కీలక డిమాండ్లు
- Advertising Rules: తెలంగాణలో ప్రకటనలపై(యాడ్స్) సర్కార్ కొత్త రూల్స్.. ఉత్తర్వులు జారీ..
- Harish Rao: రాష్ట్రంలో ఒకవైపు కరెంట్ కోతలు.. మరోవైపు కరెంటు బిల్లులతో వాతలు..
అయితే రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు హైదరాబాద్ ప్రజాభవన్‌కు రావాల్సిన అవసరం లేదని, ఎమ్మెల్యేలతో నియోజకవర్గాల్లో ప్రజావాణి నిర్వహిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నియోజకవర్గాల్లో ప్రజావాణి నిర్వహించడం ద్వారా స్థానిక సమస్యలు సత్వరమే పరిష్కారం కావడమే కాకుండా హైదరాబాద్ వచ్చే ప్రజల భారం తగ్గుతుందన్నారు. ప్రజాభవన్ వద్ద రద్దీ తగ్గి ఇక్కడి యంత్రాంగంపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. ప్రజావాణిలో భూ సంబంధిత సమస్యలు, ధరణి, ఆరోగ్యం, నిరుద్యోగం తదితర సమస్యలపైనే ఎక్కువగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రజా దర్భార్ అనే ప్రజావాణి కార్యక్రమానికి తొలిరోజు సీఎం రేవంత్ రెడ్డి నేరుగా హాజరై ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఆ తర్వాత కార్యక్రమం పేరును ప్రజావాణిగా మార్చారు. అప్పటి నుంచి ప్రతి మంత్రి హాజరై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈమేరకు ప్రజావాణికి మంత్రులు శ్రీధర్‌బాబు, కొండా సురేఖ హాజరయ్యారు.
Rs 500 Gas Cylinder: రూ.500కే గ్యాస్ సిలిండర్.. గరిష్ఠంగా రూ.4,450 కోట్ల భారం
తాజావార్తలు
-
Bhatti Vikramarka : కరెంట్ డిమాండ్‌లో బిగ్ రికార్డ్.. 20 వేల మెగావాట్లకు చేరిక.!
-
Jammu Kashmir: అఫ్జల్ గురు కుటుంబానికి షాక్.. బుల్డోజర్ యాక్షన్.!
-
RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
-
Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
-
Asaduddin Owaisi : ఓట్ల తొలగింపుపై ఒవైసీ ఫైర్.. సెక్రటేరియట్లో కీలక డిమాండ్లు
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!