టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు రాహుల్ సాంకృత్యాయన్. దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. యధార్థ సంఘటనల ఆధారంగా ఒక పీరియడ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుండగా ఇండిపెండెన్స్ ముందు రాయలసీమ ప్రాంతాన్ని నేపథ్యంలో వలసలు, కరవు జీవితం, జానపద కథలు, తిరుగుబాటు భావాలు వంటి అంశాలు ఈ కథలో ప్రధానంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ ఒక వీరయోధుడి పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం.
Also Read : Mammootty : 84 ఏళ్ల స్టార్ దర్శకుడితో ముమ్ముట్టి ‘పాదయాత్ర’.. షూటింగ్ స్టార్ట్
కాగా ఈ సినిమాకు ‘రణబలి’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు మేకర్స్. అందుకు సంబంధించి రిపబ్లిక్ డే కానుకగా సోమవారం అధికారికంగా రిలీజ్ చేయబోతున్నారు. గతంలో విజయ్ దేవరకొండ – రాహుల్ సాంకృత్యాయన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘టాక్సీవాలా’ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ విజయానంతరం లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ ఈ ఇద్దరూ కలుస్తుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈసారి కూడా బలమైన కథ, పక్కా కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. టైటిల్‌నే కాకుండా విజయ్ దేవరకొండ పాత్ర ఫస్ట్ లుక్ ను కూడా రివీల్ చేసే ఆలోచనలో ఉంది టీమ్. ఖుషి, ఫ్యామిలీ స్టార్, కింగ్డమ్ వంటి వరుస ప్లాప్స్ తో నిరుత్సహం లో ఉన్న విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ‘రణబలి’తో బ్లాక్ బస్తర్ అందుకుని సాలిడ్ కంబ్యాక్ ఇస్తాడని ధీమాగా ఉన్నారు.