Droupadi Murmu: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఐదు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. శీతాకాల విడిది కోసం సోమవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ద్రౌపది ముర్ము ఈ నెల 23 వరకు తెలంగాణలో పర్యటించనున్నారు. శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లికి రానున్నారు. ఉదయం బొల్లారంలోని రాష్ట్రపతి భవన్ నుంచి రోడ్డు మార్గంలో హకీంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో 11.00 గంటలకు పోచంపల్లి చేరుకుంటారు. అక్కడ శ్రీరంజన్ వీవ్స్ ను సందర్శించి మగ్గం నేయడం, స్పిన్నింగ్, రీలింగ్ తదితర ప్రక్రియలను పరిశీలిస్తారు. స్థానికంగా ఓ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన చేనేత స్టాళ్లు, మగ్గాలు దర్శిస్తారు. అనంతరం చేనేత ఇక్కత్ వస్త్రాల తయారీ, విక్రయాలపై ఆయా సంఘాల అధినేతలతో ముఖాముఖిలో పాల్గొంటారు. వినోబా భావే, వెదిరె రామచంద్రారెడ్డి చిత్రాలకు నివాళులర్పిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12.20 గంటలకు పోచంపల్లి నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు.
రాష్ట్రపతి షెడ్యూల్ ఇలా…
* నేడు యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో జౌళి శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చేనేత, స్పిన్నింగ్ యూనిట్‌తో పాటు థీమ్ పెవిలియన్‌ను అధ్యక్షుడు ముర్ము సందర్శిస్తారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులతోనూ ఆమె ముచ్చటించనున్నారు.
* అదే రోజు సాయంత్రం సికింద్రాబాద్‌లోని ఎంఎన్‌ఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ స్వర్ణోత్సవ వేడుకల్లో రాష్ట్రపతి పాల్గొంటారు.
* రేపు రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి వివిధ ప్రాజెక్టులను ప్రారంభిస్తారు.
* రాష్ట్రంలోని ప్రముఖులు, ప్రముఖులు, విద్యావేత్తలు తదితరులకు రేపు (డిసెంబర్ 22న) రాష్ట్రపతి నిలయంలో ఇంటి వద్ద రిసెప్షన్ ఏర్పాటు చేస్తారు.
* డిసెంబరు 23న రాష్ట్రపతి ఢిల్లీకి తిరిగి పయనం కానున్నారు.
Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?