Doctors in Kamareddy: కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉద్రికత్త చోటుచేసుకుంది. ఎలుకల దాడుల నేపథ్యంలో డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్ సస్పెన్షన్ పై వైద్యుల ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం.. ఉద్యోగ నియామక పరీక్షల వయో పరిమితి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.. ఉద్యోగ నియామక పరీక్షల వయోపరిమితి ఇప్పటి వరకు 44 ఏళ్లుగా ఉండగా.. ఇప్పుడు 44 ఏళ్ల నుండి 46 ఏళ్లకు పెంచింది రేవంత్‌రెడ్డి సర్కార్..
ఈ నెల 20వ తేదీ నుండి బీజేపీ విజయ సంకల్ప యాత్రలు చేపట్టనుంది. 20వ తేదీ నుండి 29వ తేదీ వరకు యాత్రలకు ప్లాన్ చేసింది బీజేపీ. ఈ యాత్రలను పెద్ద ఎత్తున నిర్వహించాలని బీజేపీ కార్యాచరణ చేపట్టనుంది. 5 పార్లమెంట్ క్లస్టర్లలో 5 విజయ సంకల్ప యాత్రలు చేపట్టేలా ప్లాన్ చేయనుంది.
బడ్జెట్ అన్ని వర్గాల వారిని నిరాశ పరిచిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. వాగ్దాన భంగంకు బడ్జెట్ అద్దం పడుతుందన్నారు. కొండంత ఆశలు చూపి గోరంత కూడా బడ్జెట్ ఇవ్వలేదని ఆయన వ్యాఖ్యానించారు. అసెంబ్లీలోని మీడియా పాయింట్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై హరీశ్‌రావు మాట్లాడారు.
ఈ ఏడాది ప్రవేశ పరీక్షలకు సంబంధించి తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఇప్పటికే కీలక ప్రకటన చేసింది. తాజాగా.. తెలంగాణ ఎడ్‌సెట్ షెడ్యూల్ విడుదల చేసింది. మే 23వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
Bhatti Vikramarka: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కానీ దాన్ని ఓటు ఆన్ అకౌంట్‌గా ప్రవేశపెట్టారు.
Telangana Budget 2024: డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలో మెగా డీఎస్సీ వేయబోతున్నామని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు బట్టివిక్రమార్క వెల్లడించారు.