గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశలు రేపటికి వాయిదా పడ్డాయి. దీంతో రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగనుండగా.. ఈ నెల 10వ తారీఖున తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ను ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టనున్నారు.
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కాళోజీ కవితతో ప్రసంగాన్ని గవర్నర్ తమిళిసై ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కంచెను తొలగించారు.. ప్రగతిభవన్‌ను.. ప్రజాభవన్‌గా అందుబాటులోకి వచ్చింది.. ఆరు గ్యారంటీలకు కట్టుబడి ఉన్నాం.. ఆరు గ్యారంటీలను అందుబాటులోకి తీసుకుచ్చాం.. త్వరలో మరో రెండు గ్యారంటీలను అమలు చేస్తామని ఆమె చెప్పుకొచ్చారు.
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. అయితే బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. కానీ, బడ్జెట్ రోజు మాత్రం అసెంబ్లీ సమావేశాలకు వస్తున్నట్లు తెలిపారు.
హైదరాబాద్ లో కొత్తగా డ్రోన్ పోర్ట్ ఏర్పాటు కాబోతుంది. ఈ మేరకు డ్రోన్ పైలెట్లకు అధునాతన శిక్షణకు సంబంధించి ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(ఎన్ఆర్ఎస్సీ)తో తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ మధ్య ఒప్పందం కుదిరింది.
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఆస్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు నజర్ పెట్టారు. ఈ సందర్భంగా ఈడీ, ఐటీ అధికారులు రంగంలోకి దిగే అవకాశం ఉంది. శివ బాలకృష్ణ ఎఫ్ఐర్, రిమాండ్ రిపోర్టు తదితర పత్రాలను ఇవ్వాలని ఏసీబీకి ఈడీ అధికారులు ఇప్పటికే లేఖ రాశారు.
రాజ్యసభ ఎన్నికలకు ఇవాళ నోటిఫికేషన్ విడుదల కానుంది. తెలంగాణ అసెంబ్లీలో ఈ నెల 15 వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇక, 16వ తేదీన నామినేషన్లను పరిశీలించనున్నారు. ఇక, 20వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది.
హైదరాబాద్ నగరంలో ఎన్ఐఏ సోదాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే నగరంలో పలు చోట్ల కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ సోదాలు చేస్తుంది. నేటి తెల్లవారుజాము నుంచే సీనియర్ జర్నలిస్ట్, వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్. వేణుగోపాల్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.