Shiva Balakrishna: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏసీబీ అధికారులు విచారించగా సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి.
ఉమ్మడి రాజధానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి.. విశాఖలో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ కొంత కాలం ఉమ్మడి రాజధానిగా ఉండాలనేది మా ఆలోచనగా పేర్కొన్నారు.. ఎన్నికల తర్వత ముఖ్యమంత్రి, పార్టీ నాయకత్వం దీనిపై చర్చించి ఆలోచిస్తారన్న ఆయన.. రాజధాని కట్టే అవకాశం ఉన్నా.. ఐదేళ్లు తాత్కాలిక పేరుతో టీడీపీ కాలయాపన చేసింది.. రాజధానికి కట్టే ఆర్థిక వనరులు లేక.. విశాఖ రాజధానిగా ఏర్పాటు చేస్తే న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయన్నారు.
23 students scored 100 NTA score in session 1: దేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లోని ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ 2024 సెషన్-1 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) మంగళవారం విడుదల చేసింది. పేపర్ -1 (బీఈ/బీటెక్) ఫలితాల్లో దేశవ్యాప్తంగా 23 మంది విద్యార్థులు 100 శాతం స్కోరు సాధించారు. ఈ 23 మందిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 10 విద్యార్థులు ఉన్నారు. తెలంగాణ నుంచి…