బీఆర్ఎస్ పార్టీ నేతలంతా నల్గొండ సభకు వెళ్తున్నామని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. కృష్ణ నది కింద ఉన్న ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగించటం మంచిది కాదు అని చెప్పారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆధ్వర్యంలో మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శనకు మంత్రులతో పాటు ఎంఐఎం, సీపీఐ ఎమ్మెల్యెలు వెళ్తున్నారు. మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శనకు దూరంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు.
శాసన సభ జరిగిన జరుగుతున్న తీరు ఖండిస్తున్నాను అని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. మీరు మాట్లాడి, మాకు మైకులు ఇవ్వక పోవడం సభా సంప్రదాయాలకు విరుద్ధం అన్నారు.
నేడు జరిగిన తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మేడిగడ్డకు అన్ని పార్టీల సభ్యులను ఆహ్వానించాం.. సభ్యులు వాస్తవాలు చూడాలన్నారు. మేడిగడ్డకు కేసీఆర్ వస్తానంటే హెలికాఫ్టర్ కూడా సిద్ధం చేస్తామన్నారు.
డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరుడు భట్టి వెంకటేశ్వర్లు తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న వెంకటేశ్వర్లు ఇవాళ హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత గులాబీ బాస్ కేసీఆర్ తొలిసారి జనం మధ్యలోకి రాబోతున్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని మర్రిగూడ బైపాస్ రోడ్డులోని 50 ఎకరాల స్థలంలో ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు రైతు గర్జన పేరుతో బీఆర్ఎస్ బహిరంగసభ నిర్వహిస్తుంది.