Atchannaidu: 3 రాజధానుల పేరిట చిచ్చు పెట్టారు.. హైదరాబాద్ పేరుతో నాలుగో ముక్క తెరపైకి తెచ్చారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Atchannaidu : మూడు రాజధానుల పేరిట మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారు.. మూడు ప్రాంతాల్లో బినామీ ఆస్తులు పోగేసుకున్నారు.. ఇప్పుడు హైదరాబాద్ పేరుతో నాలుగో ముక్క తెరపైకి తీసుకొచ్చారు అంటూ ఫైర్ అయ్యారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. వైవీ సుబ్బారెడ్డి నోట జగన్ రెడ్డి మాట.. బినామీ ఆస్తులు కాపాడుకోవడానికే వైవీ నోట హైదరాబాద్ పాట అని ఆరోపణలు గుప్పించారు. విశాఖలో జగన్ రెడ్డి రూ.40 వేల కోట్ల బినామీ ఆస్తుల్ని కూడగట్టుకున్నాడు. అందుకే ఇప్పటి వరకు విశాఖే రాజధాని అన్నాడు. ఇప్పుడు హైదరాబాద్‌లోని బినామీ ఆస్తుల కోసం కొత్త నాటకానికి తెరలేపారని దుయ్యబట్టారు. గతంలో అమరావతికి 30 వేల ఎకరాలుండాలని అన్నాడు. ఇక్కడే ఇల్లు కట్టుకున్నాని జగన్ అన్నాడు. అమరావతిని పూర్తి చేస్తానంటూ ప్రజల్ని నమ్మించాడు. అధికారంలోకి వచ్చాక అమరాతిని నాశనం చేశాడు అని విరుచుకుపడ్డారు.
Read Also: Jai Hanuman : జై హనుమాన్ హీరోగా కెజిఎఫ్ యష్?.. డైరెక్టర్ ప్లాన్ మాములుగా లేదుగా..
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
సీఎం జగన్.. యువతకు ఉద్యోగ, ఉపాధి దూరం చేశాడు అని విమర్శించారు అచ్చెన్నాయుడు.. రైతుల త్యాగాన్ని హేళన చేసి బూటు కాళ్లతో హింసించాడు. కర్నూలు న్యాయ రాజధాని అని చెప్పి కర్నూలుకు హైకోర్టు బెంచి రాకుండా చేశాడు. మూడు రాజధానుల పేరిట మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాడు. బినామీ ఆస్తుల కోసం ప్రాంతాల మధ్య, ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు అని దుయ్యబట్టారు. జగన్ రెడ్డి అరాచకం స్థాయి రాజధాని ఫైల్స్ సినిమా చూస్తే అర్ధమవుతుందన్న ఆయన.. 60 రోజుల తర్వాత అధికారంలోకి వస్తాం. అమరావతిని పూర్తి చేస్తాం. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసి చూపుతామని.. రాష్ట్రాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలుపుతామని ప్రకటించారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.
తాజావార్తలు
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!