ఈ ఏడాది ఉష్ణోగ్రతలు భారీగా పెరగనున్నాయని భారత వాతావరణ శాఖ శుక్రవారం తెలిపింది. ఎల్‌నినో పరిస్థితులు కొనసాగే సూచనలు ఉన్నందున ఈ ఏడాది వేసవి ప్రారంభం నుంచే ఉష్ణోగ్రతలు పెరిగిపోనున్నాయని వెల్లడించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో సాధారణం కంటే అధికంగా వడగాలులు ఉంటాయని అంచనా వేసింది.
బీఆర్ఎస్ పార్టీ భారీ షాక్ తగిలింది. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల వేళ బీఆర్ఎస్కు చెందిన జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీలో చేరారు. కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సమక్షంలో బీజేపీలో చేరారు బీబీ పాటిల్.
Dharani Special Drive: ధరణి పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి ఈ నెల 9వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ చేపట్టనుంది.
మరణం ఎప్పుడు ఎలా వచ్చి పలకరిస్తుందో చెప్పడం కష్టమే.. నవ్వుతూ గుండె పోటుతో చనిపోయిన ఘటనలను కూడా మనం చూస్తూనే ఉన్నాం.. ఎదురుగా వచ్చే వాహనమో.. అకస్మాత్తుగా వచ్చే అనారోగ్యమో.. ఈ రోజుల్లో ఏది మనిషి ప్రాణాలను హరిస్తుందో చెప్పడం చాలా కష్టమైపోయింది.. కొన్ని సార్లు మనకు ఇష్టమైన ఆహారాన్ని తినేటప్పుడు అవే ప్రాణాలను తీస్తాయి.. తాజాగా ఓ దారుణ ఘటన వెలుగు చూసింది.. తనకు ఎంతో ఇష్టమైన ఎగ్ బజ్జీ తింటూ ఓ వ్యక్తి ప్రాణాలను…
Medaram Jatara: మేడారం మహాజాతరకు అంకురార్పణ సమర్పించిన తర్వాత మండమెలిగే ఉత్సవాలను నిర్వహించారు. మాఘ శుద్ధ పౌర్ణమి సందర్భంగా ఫిబ్రవరి 21వ తేదీ బుధవారం నుంచి ఫిబ్రవరి 24వ తేదీ శనివారం వరకు మేడారం మహాజాతర జరిగింది.
Congress: 2024 లోక్‌సభ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. అయితే, ఎన్నికల ముందు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. రాజ్యసభ ఎన్నికలు హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సంక్షోభంలోకి నెట్టేసింది. మొత్తం 68 మంది ఎమ్మెల్యేలు ఉన్న అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ.. ఒక్క రాజ్యసభ ఎంపీని గెలిపించుకోలేకపోయింది. బీజేపీ పార్టీకి 25 ఎమ్మెల్యేలు ఉండగా.. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్రులు మద్దతు…
రాష్ట్రంలో ఐఏఎస్ బదిలీలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా.. ఐదుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్ కలెక్టర్‌గా రాహుల్ రాజ్, ఆదిలాబాద్ కలెక్టర్‌గా రాజర్షి, కుమురంభీమ్ ఆసిఫాబాద్ కలెక్టర్‌గా స్నేహ శబరీశ్, హైదరాబాద్ అదనపు కలెక్టర్‌గా హేమంత కేశవ పాటిల్‌ను బదిలీ చేసింది. జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్‌గా బి.హెచ్.సహదేవ్‌రావును నియమించింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉంటే.. రాష్ట్రవ్యాప్తంగా 8 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ…
హైదరాబాద్ లోని యాకత్ పురా అసెంబ్లీ నియోజకవర్గంలో విజయ సంకల్ప యాత్ర కొనసాగుతుంది. ఈ యాత్రలో ఎంపీ డా. లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బీజేపీ విజయ సంకల్ప యాత్రకు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. మరోవైపు.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. కొత్త బిచ్చగాడు పొద్దెరుగడన్నట్లు కాంగ్రెస్ వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకే గ్యారెంటీ లేదు.. ఇంకా 6 గ్యారెంటీలు ఎలా నెరవేరుస్తారని ప్రశ్నించారు.…