మరణం ఎప్పుడు ఎలా వచ్చి పలకరిస్తుందో చెప్పడం కష్టమే.. నవ్వుతూ గుండె పోటుతో చనిపోయిన ఘటనలను కూడా మనం చూస్తూనే ఉన్నాం.. ఎదురుగా వచ్చే వాహనమో.. అకస్మాత్తుగా వచ్చే అనారోగ్యమో.. ఈ రోజుల్లో ఏది మనిషి ప్రాణాలను హరిస్తుందో చెప్పడం చాలా కష్టమైపోయింది.. కొన్ని సార్లు మనకు ఇష్టమైన ఆహారాన్ని తినేటప్పుడు అవే ప్రాణాలను తీస్తాయి.. తాజాగా ఓ దారుణ ఘటన వెలుగు చూసింది.. తనకు ఎంతో ఇష్టమైన ఎగ్ బజ్జీ తింటూ ఓ వ్యక్తి ప్రాణాలను వదిలిన ఘటన వనపర్తిలో చోటు చేసుకుంది..
వివరాల్లోకి వెళితే.. మదనాపురం మండలంలోని గోవిందహళ్లికి చెందిన గొల్ల తిరుపతయ్య కి బజ్జీలు అంటే చాలా ఇష్టం. నిన్న సాయంత్రం ఇంటి ఎదుట కూర్చొని కోడిగుడ్డు బజ్జీలు తింటుండగా గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఊపిరాడక తిరుపతయ్య కిందపడిపోయాడు. భర్త కిందపడిపోవడం గమనించిన భార్య ఎంత ప్రయత్నించిన గుడ్డును బయటకు తీలేకపోయింది..
ఆమె వల్ల కాకపోవడంతో ఇరుగుపొరుగు వారిని తీసుకొని వచ్చింది.. కొద్దిసేపటికి చుట్టుపక్కల వారు వచ్చి గొంతులో ఇరుక్కుపోయిన బజ్జీని తీశారు. కానీ ప్రయోజనం లేకపోయింది.. అప్పటికే అతను ఊపిరి ఆడక చనిపోయాడు.. కళ్ల ముందే భర్త ప్రాణాలు పోవడం చూసి తట్టుకోలేక పోతుంది భార్య.. ఆమెను చూసిన అందరూ కంటతడి పెట్టుకున్నారు..