ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎందుకు ఓటింగ్లో పాల్గొనదు అని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలంగాణ న్యాయ కోవిధుడు అని, ఆయనకు మద్దతు ఇవ్వకపోవడానికి కారణమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేయలేమని బీఆర్ఎస్ చెప్పడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. రాజకీయాలకు కనెక్షన్ లేకుండా బీఆర్ఎస్ మారిందని, ఇంటి లొల్లిలకే పార్టీ పెద్దలకు సరిపోతోందని విమర్శించారు. లోక్సభ ఎన్నికల్లో గుండు సున్నా వచ్చిందని ఎంపీ చామల…
ఇంటి స్థలం విషయంలో గల్లీ లీడర్లే ప్రభుత్వ అధికారులను బెదిరిస్తుంటారు. బడా నాయకులు అయితే తమ పలుకుబడితో ఏకంగా వార్నింగ్ ఇస్తుంటారు. హైడ్రా వచ్చాక ఇలాంటి ఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. ఈ సమయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అందరికీ ఆదర్శంగా నిలిచారు. రోడ్డు విస్తరణలో భాగంగా సీఎం ఇంటి కాంపౌండ్ను అధికారులు కూల్చారు. ఇందుకు సీఎం అడ్డుచెప్పక పోగా.. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. Also Read: KTR: కవిత సస్పెన్షన్ తర్వాత.. మొదటిసారి…
మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. అన్నారం బ్యారేజ్ సుందరశాల గోదావరినదిలో నాటుపడవ బోల్తాపడింది. పొక్కూర్ లో నాటు పడవ తీసుకురావడానికి వెళ్లిన మహరాష్ట్ర సిరోంచ తాలుక మండలపూర్ కి చెందిన ఇద్దరు మత్స్యకారులు.. గోదావరి ప్రవాహంలో నాటు పడవ తీసుకువస్తుండగా అన్నారం సరస్వతీ బ్యారేజ్ 11 వ గేట్ దగ్గర ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా నాటుపడవ మునిగింది.. గడ్డం వెంకటస్వామి, తూనిరి కిష్టాస్వామి గల్లంతయ్యారు. కిష్టస్వామి ఈత కొడుతు సురక్షితంగా బయటకు వచ్చాడు. ప్రవాహంలో…
మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగం పట్ల వివక్షత చూపిస్తుందన్నారు. ఎరువుల తయారీ, సరఫరా భాద్యత కేంద్రానిదే.. ఉద్దేశ పూర్వకముగా రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ఓపెన్ చేయట్లేదు.. ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి కూడా పట్టించుకోట్లేదు.. మీకు చేతనైతే కేంద్రం మెడలు వంచి ఎరువులు తెండి.. రైతులు ఉద్యమించే వరకు కేంద్ర ప్రభుత్వం చూస్తుంది.. Also Read:Horrific Incident in Visakha: విశాఖలో…
గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్–2, 3 ప్రాజెక్ట్ పనులకు సీఎం రేవంత్ రెడ్డి నేడు గండిపేట వద్ద శంకుస్థాపన చేయనున్నారు. 7,360 కోట్ల వ్యయంతో గోదావరి తాగునీటి సరఫరా ఫేజ్-2,3 ప్రాజెక్టు ప్రారంభం కానున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి నగరానికి 20 టీఎంసీల నీరు తరలించనున్నారు. అందులో 17.5 టీఎంసీలు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు మరో రెండున్నర టీఎంసీలు మూసీ ప్రక్షాళన & జంట జలాశయాల పునరుజ్జీవనానికి వినియోగించనున్నారు. Also Read:CM Revanth…
కరీంనగర్ జిల్లాలో ప్రేమ, పెళ్లి పేరుతో మైనర్ బాలికను మోసం చేసిన ఘటన కలకలం రేపింది. వీణవంక మండలానికి చెందిన మైనర్ బాలికను రెడ్డిపల్లి గ్రామానికి చెందిన కురిమిండ్ల శ్రీనివాస్ (32) పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడు. ఆ తర్వాత ముఖం చాటేశాడు. పెళ్లి చేసుకోమని అడిగితే చంపుతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆదివారం ఉదయం బాలిక కుటుంబ సభ్యులు వీణవంక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రేమ పేరుతో మోసం చేసి గర్భవతి చేసిన…
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామంలో శనివారం ఘనంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎక్సైజ్–పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, యువజన–క్రీడల, పశువర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి రెండు ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించారు.