Off The Record: రాజగోపాల్ రెడ్డి మునుగోడు మద్యం వ్యాపారానికి షరతులు పెట్టారా?
- మునుగోడులో మద్యం వ్యాపారానికి స్పెషల్ రూల్స్..
- రాజగోపాల్‌రెడ్డి రూల్స్‌తో వ్యాపారులకు వణుకు..
- టెండర్స్ వేయడానికి వెనకాడుతున్న వ్యాపారులు..
- ఊరికి దూరంగా షాపులు పెట్టుకోవాలి..
- సాయంత్రం 4 నుంచి రాత్రి 9 మధ్యనే అమ్మకాలు..
- నో పర్మిట్ రూమ్స్, నో సిండికేట్స్..
- మునుగోడు నియోజకవర్గంలో 29 దుకాణాలు..
- 2023-2025 ఇయర్‌కు 1499 టెండర్లు ..
- ఈసారి వెయ్యిలోపు మాత్రమే టెండర్స్..
- బెల్ట్ షాపులు లేక ఇప్పటికే వ్యాపారం కళ తప్పిందన్న టాక్..
- మునుగోడు మెయిన్ షాపుకంటే పక్కన బెల్ట్‌షాప్ బిజినెస్ ఎక్కువ..
- దివాళా తీస్తామంటూ దూరంగా వ్యాపారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: మునుగోడు నియోజకవర్గంలో మద్యం దుకాణాల ఏర్పాటుకు స్పెషల్ రూల్స్ అప్లయ్ చేస్తున్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నా నియోజకవర్గం, నా ఇష్టం అన్నట్టుగా ఆయన పెట్టిన కండిషన్స్ ప్రభావం తాజా లిక్కర్ టెండర్లపై స్పష్టంగా కనిపిస్తోందట. రాజగోపాల్ రెడ్డి న్యూ రూల్స్ అండ్ కండీషన్స్‌తో ఇప్పటికే టెండర్లు వేసిన వ్యాపారులు కూడా దేవుడా… లక్కీ డ్రా మాకు తగలకుండా చూడమని దండాలు పెట్టుకుంటున్నట్టు తెలిసింది. ఇక కొత్తగా టెండర్స్ వేయడానికి చాలామంది వెనకడుగు వేస్తున్నారట. తన పరిధిలోని వైన్ షాపులకు స్థానికులో టెండర్ వేయాలన్నది రాజగోపాల్‌రెడ్డి ఫస్ట్ రూల్. ఇక షాపులను ఊరికి దూరంగా పెట్టుకోవాలని, సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు మాత్రమే తెరిచి..వ్యాపారం చేసుకోవాలని, పర్మిట్ రూమ్స్‌కు అస్సలు పర్మిషన్ లేదని, సిండికేట్‌ను సహించే ప్రసక్తే లేదంటూ…తన సొంత రాజ్యాంగం రాసేశారు ఎమ్మెల్యే. దీంతో మద్యం వ్యాపారులకు వణుకు పుడుతోందట. భయపడుతూ బిజినెస్ చేసే బదులు అసలు మానుకుంటే పోలా అని ఆలోచిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.
మునుగోడు నియోజకవర్గంలో ఉన్న 29 మద్యం దుకాణాలకు 2023-2025లో 1499 టెండర్లు దాఖలవగా…. తాజాగా 25-27 కోసం వెయ్యిలోపే వచ్చాయట.ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నయా రూల్సే ఇందుకు కారణమని తెలుస్తోంది. దరఖాస్తుల సంఖ్య తగ్గడానికి రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ ఒక కారణం అయితే.. ఆయన గెలిచిన నాటి నుండి బెల్ట్ షాపులకు చెక్ పెట్టడం, కొత్త షాపుల్లో కూడా పర్మిట్ రూమ్ లకు అనుమతి ఇచ్చేది లేదని తేల్చిచెప్పడం కూడా మరో కారణమంటున్నారు. వైన్స్ షాపులకు అనుబంధంగా బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్స్ నడిస్తేనే లిక్కర్ వ్యాపారం సవ్యంగా ఉంటుందని అంటున్నారు వ్యాపారులు. కానీ… రాజగోపాల్ రెడ్డి గెలిచిన నాటి నుండి నియోజకవర్గంలో బెల్ట్ షాపులు మూత పడటంతో లిక్కర్ వ్యాపారుల గల్లాపెట్టె కళ తప్పిందట. ఇక కొత్తగా వచ్చే షాపులకు పర్మిట్ రూమ్స్‌ని కూడా అనుమతించకపోతే తూర్పుకు తిరిగి దండం పెట్టాల్సిందేనని అంటున్నారు లిక్కర్ వ్యాపారులు. ఇక్కడ బెల్ట్ షాపులను మూసివేయడంతో.. నియోజకవర్గ సరిహద్దు గ్రామాల్లో బెల్ట్ షాపుల డైలీ క్యాష్ కౌంటర్.. మునుగోడు నియోజకవర్గంలోని మెయిన్ వైన్స్ షాపులకంటే ఎక్కువగా ఉన్నట్టు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో.. టెండర్లు ధాఖలు చేస్తే దివాళా తీయడం ఖాయమని భావిస్తూ… ఈసారి దూరంగా ఉంటున్నారట ఎక్కువ మంది వ్యాపారులు. తన స్టేట్‌మెంట్స్‌తో ఎమ్మెల్యే… మా నోటి కాడి ముద్ద… మందు బాబుల నోటికాడ సీసాను లాగేస్తున్నారంటూ పెదవి విరుస్తున్నారు లిక్కర్ వ్యాపారులు.
Also Read
తాజావార్తలు
-
Tollywood Directors: రాజమౌళి హిట్ ఫార్ములా.. ఇప్పుడు సుక్కుతో సహా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లందరిదీ అదే దారేనా?
-
Pahalgam Terror Attack Case: పహల్గామ్ దాడి కేసులో కీలక పరిణామం.. హఫీజ్ సయీద్‌కు NIA సమన్లు
-
AP Job Calendar 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ 2026..
-
MK. Stalin: 110 రోజుల తర్వాత ఓటమిపై స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
-
CJP: కాక్రోచ్ పార్టీపై కేసు.. రాజస్థాన్ గ్రామస్తుల ఫిర్యాదు..
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!