నల్లగొండ నియోజకవర్గ కమలం పార్టీలో.... జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి వన్‌మేన్ షో చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదీకూడా.. వాళ్ళు వీళ్ళు కాకుండా... డైరెక్ట్‌గా పార్టీ కేడరే అలా మాట్లాడుకుంటోందన్న వ్యవహారం చర్చనీయాంశం అవుతోంది. తాజాగా నల్లగొండ పట్టణంలో వినాయక నిమజ్జన శోభాయాత్ర ప్రారంభ పూజా కార్యక్రమం రచ్చ కూడా ఇందులో భాగమేనంటున్నారు. జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వేదిక మీద ఉండగానే.. బీజేపీ జిల్లా అధ్యక్షుడు చేసిన రచ్చ,
ప్రతిపక్షంలోకి వచ్చాక బీఆర్ఎస్కు షాకుల మీద షాక్‌లు తగులుతున్నాయి. పదేళ్ళపాటు తిరుగులేని అధికారాన్ని చెలాయించిన పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో పవర్ కోల్పోవడం ఒక ఎత్తయితే....ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోవడం మరింత కుంగదీసింది. ఇక పార్టీని రీ ఛార్జ్ చేయాలి, గ్రామస్థాయి నుంచి మళ్ళీ పటిష్టం చేయడం కోసం జనంలోకి దూకుడుగా వెళ్ళాలనుకుంటున్న టైంలో... కవిత రూపంలో ఊహించని మాస్టర్ స్ట్రోక్ తగిలింది. మూడు నెలల క్రితమే తేడా వచ్చినా...…
తెలంగాణలో పార్టీ మారి... మెడమీద అనర్హత కత్తి వేలాడుతున్న ఎమ్మెల్యేల్లో చాలామంది వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. టెక్నికల్ మాట్లాడుతున్నారు. పార్టీ మారలేదని కొందరు, అభివృద్ధి పనుల కోసమే ముఖ్యమంత్రిని కలిశామని మరికొందరు చెప్పుకుంటున్నారు. మరోవైపు అనర్హత పిటిషన్ విషయంలో... చర్చ సీరియస్‌గానే నడుస్తోంది. స్పీకర్‌కి సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు కూడా దగ్గర పడుతుండటంతో... ఇక నాన్చకుండా... ఏదో ఒక చర్య తీసుకునే అవకాశం ఉందనే టాక్ గట్టిగానే ఉంది పొలిటికల్ సర్కిల్స్‌లో.
అంబర్ పేట్లో మూసీ కాలువలో కొట్టుకొచ్చిన అనుమానస్పద మృతదేహంపై మిస్టరీ వీడింది. యువకుడిని (షోరబ్) హత్య చేసి మూసీ కాలువలో పడేశారని పోలీసులు స్పష్టం చేశారు. నిందితులు (మహమ్మద్ జావిద్, మహమ్మద్ అమీరుల్ హాక్) యువకుడి మెడకి వైర్లు చుట్టి హత్య చేసినట్లుగా గుర్తించారు. అంబర్ పేట పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. డీసీపీ బాలస్వామి యువకుడి హత్య వివరాలను మీడియాకు వెల్లడించారు. మహమ్మద్ జావేద్ (27), మహమ్మద్ అమీరుల్ హాక్, షోరబ్ (30) ముగ్గురు…
Telangana BJP State Committee Announcement: తెలంగాణ రాష్ట్ర కమిటీని బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. ముగ్గురు జనరల్ సెక్రటరీలు (ప్రధాన కార్యదర్శులు), 8 మంది రాష్ట్ర ఉపాధ్యక్షులతో కమిటీ ఏర్పాటైంది. జనరల్ సెక్రటరీలుగా గౌతమ్ రావు, వీరేందర్ గౌడ్, వేముల అశోక్‌ను నియమించినట్లు తెలంగాణ బిజెపి చీఫ్ రామచందర్ రావు తెలిపారు. ఉపాధ్యక్షులుగా బూర నర్సయ్య గౌడ్, కాసం వెంకటేశ్వర్లు, బండారి శాంతికుమార్, బండ కార్తీకారెడ్డి.. ఎన్నికయ్యారు. సెక్రటరీ, ట్రెజరర్, జాయింట్ ట్రెజరర్, చీఫ్ స్పోక్స్ పర్సన్,…
నల్గొండ ప్రజల కోసమే మూసీ నదిని ప్రక్షాళన చేస్తున్నాం అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లాలో పాదయాత్ర చేసినప్పుడు మూసీ నదిని ప్రక్షాళన చేయాలని ప్రజలు చెప్పారని.. ఎవరెన్ని సమస్యలు సృష్టించినా సమన్వయంతో ముందుకెళ్తున్నామన్నారు. ఈ పథకం ద్వారా హైదరాబాద్ తాగునీటి సమస్య మాత్రమే కాకుండా.. నల్గొండ ఫ్లోరైడ్ సమస్య కూడా తీరుతుందన్నారు. సబర్మతి, యమునా, గంగా నది ప్రక్షాళన జరగొచ్చు కానీ.. మూసీ నది ప్రక్షాళన జరగొద్దా? అని సీఎం ప్రశ్నించారు. మూసీ…
ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా మూసీ నదిని తప్పకుండా ప్రక్షాళన చేస్తాం అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గత ఏడాదే గోదావరి ఫేజ్ 2, 3 పనులు ప్రారంభిద్దాం అనుకున్నా కొందరు అడ్డుకున్నారని.. గోదావరి ఫేజ్ 2, 3 ద్వారా 20 టీఎంసీల నీటిని తీసుకువస్తాం అని చెప్పారు. 2014 నుంచి బీఆర్ఎస్ ఒక్క చుక్క నగరానికి తీసుకురావాలనే ఆలోచన చేయలేదని, తాము మరలా అధికారంలోకి వచ్చాక గోదావరి నీటిని తీసుకురావడానికి ప్రణాళికలు చేసి ముందుకెళ్తున్నామన్నారు. ప్రాణహిత…