వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామంలో శనివారం ఘనంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎక్సైజ్–పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, యువజన–క్రీడల, పశువర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి రెండు ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించారు.
హైదరాబాద్ నగరంలో గణేష్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగుతోంది. దారులన్నీ గణపయ్య విగ్రహాలతో హుస్సేన్ సాగర్ వైపు పయనమయ్యాయి. గణపయ్య భక్తులు ఆటపాటలతో శోభాయాత్రాలో పాల్గొంటున్నారు. గణేష్ నిమజ్జనం వేళ నగరమంతా సందడి వాతావరణం నెలకొంది. నగరంలో అత్యంత విశిష్టత కలిగిన ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర ఈ ఉదయం ప్రారంభమైన విషయం తెలిసిందే. వేలాది మంది భక్తులు శోభాయాత్రలో పాల్గొనగా బడా గణేషుడు హుస్సేన్ సాగర్ కు తరలివెళ్లాడు. Also Read:KantaraChapter1: కాంతారా -1 మలయాళ…
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ అస్వస్థతకు గురయ్యారు. గమనించిన సిబ్బంది వెంటనే జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రవీణ్ సూద్ ఆరోగ్యం నిలకడగా ఉందంటున్నారు వైద్యులు. నిన్న శ్రీశైలం వెళ్లి తిరిగి హైదరాబాద్ కు వచ్చారు ప్రవీణ్ సూద్. జూబ్లీహిల్స్ లోని సిబిఐ గెస్ట్ హౌస్ లో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన సీబీఐ గెస్ట్ హౌస్ సిబ్బంది ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
అంతా ఉత్కంఠగా ఎదురుచూసిన బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం ముగిసింది. భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తుల నడుమ వేలం ఆద్యాంతం ఆసక్తికరంగా సాగింది. బాలాపూర్ గణేష్ లడ్డూ ధర సరికొత్త రికార్డ్ ను సృష్టించింది. వేలంలో రూ. 35 లక్షలు పలికింది. లింగాల దశరథ గౌడ్ అనే భక్తుడు వేలం పాటలో బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నాడు. 2024లో రూ.30.01 లక్షల ధర పలికిన విషయం తెలిసిందే. Also Read:US Tariffs: 2 నెలల్లో భారత్ క్షమాపణలు చెబుతుంది..…
ఖైరతాబాద్ గణేషే కాదు బాలాపూర్ లడ్డూ వరల్డ్ ఫేమస్. హైదరాబాద్లో మహా నిమజ్జనం అంటే తొలుత అందరి చూపు బాలాపూర్ లడ్డూవైపే.ఈసారి వేలం ఎంత ఉత్కంఠగా జరుగుతోంది.లడ్డూ ధర ఎంత పలుకుతోంది?సరికొత్త రికార్డ్ బ్రేక్ అవుతుందా? ఎవరి నోట విన్నా ఇదే మాట. బాలాపూర్ గణపతి లడ్డూ యావత్ ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. లక్షల్లో పలుకుతూ ఏటేటా రికార్డులు బ్రేక్ చేస్తున్న ఈ లడ్డూ చరిత్ర ఎంతో ఘనమైంది.దీన్ని కొన్నవారికి కొంగు బంగారం అవుతుందనేది సెంటిమెంట్.లంబోదరుడి చేతిలో పూజలు…
ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. రెండు గంటలు ఆలస్యంగా శోభాయాత్ర ప్రారంభం కావడంతో వేగంగా ముందుకు సాగుతోన్న బడా గణపతి.. వడివడిగా పోలీసులు కదిలిస్తున్నారు. తెలుగు తల్లి ఫ్లై ఓవర్ రూట్ లో గణేష్ లను దారి మళ్లిస్తున్నారు. వినాయకులన్నిటినీ ట్యాంక్ బండ్ వైపు దారి మళ్లిస్తున్నారు. ఖైరతాబాద్ వినాయకుడు శోభాయాత్ర ప్రారంభం కావడంతో రోడ్ క్లియర్ చేస్తున్నారు పోలీసులు. తెలుగు తల్లి ఫ్లై ఓవర్, సచివాలయం వద్ద గణేష్ క్యూ లైన్ చూస్తుంటే… ఈసారి…
తెలంగాణలో రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. గత కొంత కాలంగా బీఆర్ఎస్ లో అతర్గత వ్యవహారాలు చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కల్వకుంట్ల కవిత పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న తీరుపై ఆపార్టీ నాయకులు, కార్యకర్తలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో హరీష్ రావు అవినీతికి పాల్పడ్డాడని బహిరంగంగానే బయటపెట్టింది కవిత. అంతేకాదు సంతోష్ రావు కూడా కుట్రలు పన్నుతున్నాడని తెలిపింది. దీంతో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. దీంతో బీఆర్ఎస్ అధినేత…
బాలాపూర్లో 1994లో రూ.450తో ప్రారంభమైన ఈ లడ్డూ వేలం.. ప్రతీ ఏడాది పెరుగుతూ వచ్చింది.. 2023లో రూ.27 లక్షలు పలకగా.. 2024లో రూ.30.01 లక్షలకు చేరి తన రికార్డును తానే అధిగమించాడు బాలాపూర్ గణపయ్య..