మాడుగుల టీడీపీలో టిక్కెట్ రచ్చ: మాడుగుల టీడీపీలో టిక్కెట్ రచ్చ జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే రామానాయుడు బల ప్రదర్శనకు సిద్ధమయ్యారు. నేడు నాలుగు మండలల్లో బైక్ ర్యాలీ, భారీ సమావేశం జరగనుంది. ఇప్పటికే రామానాయుడికి వైసీపీ టచ్‌లోకి వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. ఎన్ఆర్ఐ పైలా ప్రసాద్‌కు టీడీపీ అధిష్టానం టిక్కెట్ కేటాయించింది. అయితే వ్యతిరేకత పెరగడంతో మాజీ మంత్రి బండారు, మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి పేర్లను హైకమాండ్ పరిశీలిస్తోంది. కాంగ్రెస్‌ని నమ్మి మోసపోవడనికి ప్రజలు సిద్ధంగా లేరు:…
Bharat Ratna : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్గజాలకు నేడు భారతరత్న అవార్డులను ప్రదానం చేశారు. మరణానంతరం పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, కర్పూరీ ఠాకూర్, ఎంఎస్ స్వామినాథన్‌లకు భారతరత్న పురస్కారాన్ని అందజేశారు.
వేసవి ఎండలు రోజు రోజుకూ మండిపోతుండటంతో ఆ తాపాన్ని తగ్గించుకునేందుకు జనం పలు రకాల పానీయాలను తాగుతుంటారు. దీంతో మార్కెట్లో నిమ్మకాయల ధరలకు రెక్కలొచ్చాయి.
బీఆర్ఎస్ నేతలు పార్టీని వీడుతుండటంపై మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలు మారే వారు పవర్ బ్రోకర్లని హరీష్ వ్యాఖ్యానించారు. కొంత మంది రాజకీయ అవకాశవాదులు, పవర్ బ్రోకర్లు పార్టీని విడిచిపోతున్నారని అన్నారు.
CM Revanth Reddy: నేడు పీఈసీ కమిటీ సమావేశం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గాంధీభవన్‌లో జరగనుంది. రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.
బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఎంపీ అభ్యర్థి కడియం కావ్య లేఖ రాశారు. ఎంపీ ఎన్నికల్లో పోటీ నుండి తప్పుకుంటున్నట్లు లేఖలో కడియం కావ్య తెలిపారు.