CM Revanth Reddy: నేడు పీఈసీ కమిటీ సమావేశం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గాంధీభవన్‌లో జరగనుంది. రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఇక లోక్‌సభ ఎన్నికల్లో విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో చర్చించనున్నారు. అంతేకాకుండా ఏప్రిల్ 6న తుక్కుగూడలో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొనే సభను విజయవంతం చేసే అంశంపై కూడా సమావేశంలో చర్చిస్తారు. 6న తుక్కుగూడలో జరిగే బహిరంగ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ హాజరు కానున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఈ సమావేశంలో ఏఐసీసీ ఇన్‌చార్జ్ దాస్ మున్షీ, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు, పీఈసీ సభ్యులు పాల్గొంటారు.
Read also: IPL 2024 RCB vs KKR: సొంత గడ్డపై మరోసారి ఆర్సీబి గర్జిస్తుందా..?!
మరోవైపు పార్లమెంటు ఎన్నికలను దృస్టిలో ఉంచుకుని ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఛైర్మన్ గా ప్రజల ముంగిట్లోకి జాతీయ మేనిఫెస్టో కమిటీని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఏర్పాటు చేశారు. అంతేకాకుండా.. పార్టీ జాతీయ మేనిఫెస్టో ప్రజల చెంతకు చేరేలా ఏం చేయాలనే దానిపై ఈ కమిటీ 15రోజుల్లో టీపీసీకి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో తుక్కుగూడ నుంచే ప్రచారానికి శంఖారావం పూరించారు. ఇక్కడి సభావేదిక నుంచే సోనియా గాంధీ 6గ్యారంటీలు ప్రకటించారు. కాగా.. రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో తుక్కుగూడను పార్టీ సెంటిమెంట్‌గా భావిస్తోంది. ఇక లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేస్తున్న తుక్కుగూడ బహిరంగ సభను రాష్ట్ర కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. సభ విజయవంతానికి ఏర్పాట్లు, నిర్వహణ కమిటీలు, జనసమీకరణ తదితర అంశాలపై ఇవాళ జరిగే పీఈసీ సమావేశంలో నేతలకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు.
Mukhtar Ansari : మా నాన్నకు విషమిచ్చి హత్య చేశారు.. అన్సారీని చూసి కొడుకు ఆరోపణ