ఫోన్ టాపింగ్ కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధా కిషన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. సుదీర్ఘంగా 10గంటల పాటు విచారించిన అనంతరం రాధాకిషన్రావును అదుపులోకి తీసుకున్నారు. రేపు ఉదయం రాధాకిషన్ రావును కోర్టులో హాజరుపర్చనున్నారు.
ఆ మాజీ ఎమ్మెల్యే రెండు ప్రధాన పార్టీలతో దోబూచులాడుతున్నారు. ఇంకా చెప్పాలంటే... కండిషన్స్తో టెన్షన్ పెడుతున్నారు. ఉన్న పార్టీ మీద అలిగారు.... రమ్మన్న పార్టీకి కండిషన్స్ అప్లై అంటున్నారు. ఆ ఎపిసోడ్కి ఎండ్ కార్డ్ ఎలా పడుతుందా అని రెండు పార్టీల కేడర్ ఆసక్తిగా చూస్తోంది. ఇంతకీ ఎవరా నాయకుడు? ఆయనకే ఎందుకంత డిమాండ్?
తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగ మండిపోతున్నాడు. భానుడి ప్రతాపంతో ప్రజలు ఉక్కపోతతో అల్లాడుతున్నారు. నేటి నుంచి 5రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఎండల తీవ్రత పెరుగుతున్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉదయం 10 గంటల నుంచే ఎంత తీవ్రత అధికంగా ఉంటుంది.
తాను ఈ గడ్డ బిడ్డనని.. తనకు ఇక్కడి సమస్యలపై పూర్తి అవగాహన ఉందని ఖమ్మం బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
రాష్ట్రంలో కలకలం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మాజీ టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకిషన్రావు, గట్టుమల్లును అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో డీసీపీ విజయ్ ఆధ్వర్యంలో విచారిస్తున్నారు.
TS TET 2024: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్ టెట్) దరఖాస్తు ప్రక్రియ నిన్న (బుధవారం) నుంచి ప్రారంభమైంది. అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఏప్రిల్ 10 వరకు ఆన్లైన్లో https://tstet2024.aptonline.in/tstet/లో దరఖాస్తు చేసుకోవచ్చు.