మాడుగుల టీడీపీలో టిక్కెట్ రచ్చ:
మాడుగుల టీడీపీలో టిక్కెట్ రచ్చ జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే రామానాయుడు బల ప్రదర్శనకు సిద్ధమయ్యారు. నేడు నాలుగు మండలల్లో బైక్ ర్యాలీ, భారీ సమావేశం జరగనుంది. ఇప్పటికే రామానాయుడికి వైసీపీ టచ్‌లోకి వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. ఎన్‌ఆర్‌ఐ పైలా ప్రసాద్‌కు టీడీపీ అధిష్టానం టిక్కెట్ కేటాయించింది. అయితే వ్యతిరేకత పెరగడంతో మాజీ మంత్రి బండారు, మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి పేర్లను హైకమాండ్ పరిశీలిస్తోంది.
కాంగ్రెస్‌ని నమ్మి మోసపోవడనికి ప్రజలు సిద్ధంగా లేరు:
ప్రజలు మాత్రం మరోసారి కాంగ్రెస్ ని నమ్మి మోసపోవడనికి సిద్ధంగా లేరని బీజేపీ రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. తెలంగాణాలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి అవలంబిస్తున్న తీరును ఆయన ఖండించారు. గతంలో టీఆర్ఎస్, బీఆర్ఎస్ అవలంబించిన విధానాన్నే రేవంత్ రెడ్డి ఇప్పుడు కొనసాగిస్తున్నాడని తెలిపారు. వేరొక పార్టీ బీ ఫామ్ మీద గెలిచి ఎమ్మెల్యే లను కాంగ్రెస్ లో చేర్చుకున్నారని మండిపడ్డారు. గతంలో స్వయంగా రేవంత్ రెడ్డి అవినీతి ఆరోపణలు చేసిన వారిని కూడా తమ పార్టీలో చేర్చుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేడు ఢిల్లీకి సీఎం రేవంత్:
సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి ఇవాళ మళ్లీ ఢిల్లీ వెళ్లనున్నారు. వారి వెంట తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపా దాస్ మున్షీ వెళ్లనున్నారు. ఎంపీ అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ ఈరోజు సాయంత్రం సమావేశం కానుంది. ఈ సమావేశంలో పెండింగ్‌లో ఉన్న పార్లమెంట్ సీట్లపై చర్చించి అభ్యర్థుల ఫైర్‌ను సీఈసీ ఖరారు చేయనుంది. కాంగ్రెస్ పార్టీ 13 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మరో నాలుగు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నాలుగు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. అధికారులతో మాట్లాడి అభ్యర్థులపై చర్చించి అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు.
నేడు కేసీఆర్ జిల్లాల పర్యటన:
నేడు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. నీటి ఎద్దడితో ఎండిపోతున్న పంటలను పరిశీలించి, కరువుతో అల్లాడుతున్న రైతుల్లో ధైర్యం నింపేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జిల్లాల వారీగా పర్యటించనున్నారు. అందులో భాగంగానే ఇవాళ జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. పంటలను పరిశీలించి రైతుల్లో ధైర్యం నింపనున్నారు. ముందుగా జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో పర్యటిస్తారు. అక్కడి నుంచి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అర్వపల్లికి వెళ్తారు. అనంతరం నల్గొండ జిల్లా హాలియా మండలంలో పర్యటించి రైతులను ప్రోత్సహించనున్నారు.
ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులు, నక్సలైట్ల మధ్య ఎన్‌కౌంటర్:
ఛత్తీస్‌గఢ్‌లో సైనికుల యాంటీ నక్సల్స్ ఆపరేషన్ నిరంతరం కొనసాగుతోంది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతం అబుజ్మద్‌లో 48 గంటల పాటు సైనికుల యాంటీ నక్సల్ ఆపరేషన్ కొనసాగింది. ఈ క్రమంలో పోలీసులు, నక్సలైట్ల మధ్య మూడు సార్లు ఎన్‌కౌంటర్‌లు జరిగాయి. నారాయణపూర్ జిల్లా సోన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్‌కౌంటర్ జరిగింది. వివిధ చోట్ల దాదాపు 4 గంటల పాటు కాల్పులు కొనసాగాయి. సైనికులు పొంగిపొర్లడం చూసి నజ్కలి అడవి వైపు పారిపోయిందని చెబుతారు. ఆ తర్వాత సైనికులు 5 కిలోల ఐఈడీ పేలుడుతో సహా భారీ మొత్తంలో నక్సలైట్ పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
సిలిండర్ పేలుడు.. ఐదుగురు సజీవదహనం:
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లోని సింధియా నగర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడ ఓ ఇంటిపై హైటెన్షన్ వైరు పడింది. దీంతో ఇంట్లోకి కరెంట్ సరఫరా వచ్చింది. దాంతో ఇంట్లో ఉంచిన సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో ఇంట్లోని ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా కాలిపోయారు. ఇరుగుపొరుగు వారి సహాయంతో పోలీసులు అందరినీ జయరోగ్య ఆసుపత్రిలోని కాలిన వార్డులో చేర్పించారు.
ప్రముఖ విద్యాసంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా శ్రీలీల:
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఒక్క సినిమాతో హిట్ భారీ హిట్ ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత సినిమాలను లైనప్ పెట్టుకుంటూ ఏకంగా అరడజను సినిమాలను చేసింది. అయితే అందులో కొన్ని మాత్రమే సూపర్ హిట్ ను అందుకున్నాయి. దాంతో కథల విషయంలో అమ్మడు ఆచి తూచి ఎంపిక చేసుకుంతుంది. అందుకే ఇప్పుడు సినిమాలకు గ్యాప్ తీసుకుంది. అయితే తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ప్రముఖ విద్యాసంస్థల్లో ఒకటైన శ్రీచైతన్య విద్యాసంస్థల బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహారిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
పెళ్లి ముహుర్తం ఫిక్స్ అంటున్న నవదీప్:
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్టులో ప్రభాస్ తర్వాత మరో హీరో ఎవరంటే నవదీప్ అని ఇట్టే చెప్పేస్తారు. ఈమధ్య విడుదలైన ఈగల్ చిత్రంలో నవదీప్ మాస్ మహారాజా రవితేజ పక్కన నటించి మెప్పించాడు. ఒకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూనే వివిధ సినిమాలలో అనేక క్యారెక్టర్లు చేస్తూ నటిస్తున్నాడు. ఇక ఈ హీరో విషయం సంబంధించి ఈయన ఎక్కడికి వెళ్ళినా అడిగే మొదటి ప్రశ్న మీకు పెళ్లి ఎప్పుడు అని. ఇక ఇందుకు సంబంధించి తాజాగా ఓ వీడియో పోస్ట్ చేశాడు. నవదీప్ పెళ్లి కార్డు షేర్ చేసి ఒకింత షాక్ ఇచ్చాడు. అయితే నవదీప్ షేర్ చేసిన వీడియోలో పెళ్లి కార్డు కనిపించడం నిజమే.. కాకపోతే అది పెళ్లి కార్డులా కనిపించినా.. నిజానికి అది తాను హీరోగా నటించిన లవ్ మౌళి సినిమా సంబంధించిన రిలీజ్ డేట్ పూర్తి వివరాలను తెలిపే వీడియో.
చెన్నై వరుస విజయాలకు ఢిల్లీ బ్రేకులు వేయగలదా:
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 13వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడేందుకు చెన్నై సూపర్ కింగ్స్ సిద్దమైంది. ఇరు జట్ల మధ్య నేడు రాత్రి 07:30కు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. చెన్నై, ఢిల్లీ టీమ్స్ ఇప్పటివరకు 29 మ్యాచ్‌ల్లో ఒకదానితో ఒకటి తలపడ్డాయి. అందులో 10 మాత్రమే ఢిల్లీ గెలిచింది. 19 మ్యాచ్ లలో చెన్నై విజయం సాధించింది.