Rapido Cab Services: హైదరాబాద్‌లో మరో కొత్త క్యాబ్ సర్వీస్ అందుబాటులోకి రానుంది. ఊబర్, రాపిడో తరహాలోనే 'ఓకే చలో' పోస్టిలియన్ మొబిలిటీ టెక్నాలజీస్ ఈ అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చింది.
వైసీపీకి గుడ్ బై చెప్పే యోచనలో జంగా కృష్ణమూర్తి?: శాసనసభ, లోక్‌సభ ఎన్నికల ముందు వైసీపీకి భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. పల్నాడులో వైసీపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఉన్నట్లు తెలుస్తోంది. నేడు బాపట్లలో టీడీపీ అధినేత నారా చంద్రబాబును జంగా కలవనున్నారట. ఏప్రిల్ 4 లేదా 5వ తేదీలలో కార్యకర్తలతో కలిసి పల్నాడులో జరిగే బహిరంగ సభలో టీడీపీలో చేరే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే పల్నాడులోని టీడీపీ…
Kadiyam Srihari, Kavya Joins Congress: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షి సమక్షంలో వారు కాంగ్రెస్‌లో చేరారు. శ్రీహరి, కావ్యలకు దీపాదాస్ మున్షి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవల కడియం కావ్యకు బీఆర్ఎస్ వరంగల్ లోక్‌సభ స్థానంలో టికెట్ ఇచ్చింది. అయితే బీఆర్ఎస్ నుంచి పోటీ చేసే ఉద్దేశం లేదంటూ ఆమె నిరాకరించిన సంగతి…
మాడుగుల టీడీపీలో టిక్కెట్ రచ్చ: మాడుగుల టీడీపీలో టిక్కెట్ రచ్చ జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే రామానాయుడు బల ప్రదర్శనకు సిద్ధమయ్యారు. నేడు నాలుగు మండలల్లో బైక్ ర్యాలీ, భారీ సమావేశం జరగనుంది. ఇప్పటికే రామానాయుడికి వైసీపీ టచ్‌లోకి వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. ఎన్ఆర్ఐ పైలా ప్రసాద్‌కు టీడీపీ అధిష్టానం టిక్కెట్ కేటాయించింది. అయితే వ్యతిరేకత పెరగడంతో మాజీ మంత్రి బండారు, మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి పేర్లను హైకమాండ్ పరిశీలిస్తోంది. కాంగ్రెస్‌ని నమ్మి మోసపోవడనికి ప్రజలు సిద్ధంగా లేరు:…
Bharat Ratna : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్గజాలకు నేడు భారతరత్న అవార్డులను ప్రదానం చేశారు. మరణానంతరం పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, కర్పూరీ ఠాకూర్, ఎంఎస్ స్వామినాథన్‌లకు భారతరత్న పురస్కారాన్ని అందజేశారు.
వేసవి ఎండలు రోజు రోజుకూ మండిపోతుండటంతో ఆ తాపాన్ని తగ్గించుకునేందుకు జనం పలు రకాల పానీయాలను తాగుతుంటారు. దీంతో మార్కెట్లో నిమ్మకాయల ధరలకు రెక్కలొచ్చాయి.
బీఆర్ఎస్ నేతలు పార్టీని వీడుతుండటంపై మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలు మారే వారు పవర్ బ్రోకర్లని హరీష్ వ్యాఖ్యానించారు. కొంత మంది రాజకీయ అవకాశవాదులు, పవర్ బ్రోకర్లు పార్టీని విడిచిపోతున్నారని అన్నారు.