CM Revanth Reddy: నేడు పీఈసీ కమిటీ సమావేశం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గాంధీభవన్‌లో జరగనుంది. రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.
బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఎంపీ అభ్యర్థి కడియం కావ్య లేఖ రాశారు. ఎంపీ ఎన్నికల్లో పోటీ నుండి తప్పుకుంటున్నట్లు లేఖలో కడియం కావ్య తెలిపారు.
ఫోన్ టాపింగ్ కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధా కిషన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. సుదీర్ఘంగా 10గంటల పాటు విచారించిన అనంతరం రాధాకిషన్‌రావును అదుపులోకి తీసుకున్నారు. రేపు ఉదయం రాధాకిషన్ రావును కోర్టులో హాజరుపర్చనున్నారు.
ఆ మాజీ ఎమ్మెల్యే రెండు ప్రధాన పార్టీలతో దోబూచులాడుతున్నారు. ఇంకా చెప్పాలంటే... కండిషన్స్‌తో టెన్షన్ పెడుతున్నారు. ఉన్న పార్టీ మీద అలిగారు.... రమ్మన్న పార్టీకి కండిషన్స్ అప్లై అంటున్నారు. ఆ ఎపిసోడ్‌కి ఎండ్ కార్డ్ ఎలా పడుతుందా అని రెండు పార్టీల కేడర్ ఆసక్తిగా చూస్తోంది. ఇంతకీ ఎవరా నాయకుడు? ఆయనకే ఎందుకంత డిమాండ్?
తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగ మండిపోతున్నాడు. భానుడి ప్రతాపంతో ప్రజలు ఉక్కపోతతో అల్లాడుతున్నారు. నేటి నుంచి 5రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఎండల తీవ్రత పెరుగుతున్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉదయం 10 గంటల నుంచే ఎంత తీవ్రత అధికంగా ఉంటుంది.