వైఎస్ జగన్ పాదయాత్ర 2.0 ఎలా ఉండబోతోంది..?
2017లో ప్రజా సంకల్పయాత్ర పేరుతో పాదయాత్ర చేసి 2019లో 151 సీట్లతో అధికారం సాధించారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్. 2027లో పాదయాత్ర 2.0 కూడా వైసీపీకి పునరుజ్జీవన శక్తిగా మారనుందని నేతలు విశ్వసిస్తున్నారు. మాజీ మంత్రి పేర్ని నాని 2027 జగన్ పాదయాత్ర 2.0 ఉంటుందని తాజాగా ప్రకటించడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. అనూహ్యంగా 2024 ఎన్నికల్లో కేవలం 11 సీట్లకు పరిమితమై భారీ పరాజయం మూటగట్టుకున్నారు. ఇప్పట్లో వైసీపీ కోలుకుంటుందా అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ బౌన్స్ బ్యాక్ అయ్యారు జగన్. ఓవైపు పార్టీ అధికారం కోల్పోవటం, కీలక నేతలు పార్టీని వీడటం, ముఖ్య నేతలపై వరుస కేసులు, అరెస్టులు.. జైళ్ల పరంపర కొనసాగుతున్నా జగన్ మాత్రం తన పని తాను చేసుకుపోతున్నారు. ఓవైపు రైతులకు పరామర్శలు, మరోవైపు మెడికల్ కాలేజీల PPPపై ఉద్యమం సాగిస్తున్నారు. పార్టీని రూట్ లెవల్ నుంచి రీబిల్డ్ చేస్తున్న జగన్… బూత్ కమిటీల నుంచి పీఏసీల వరకూ కొత్తరక్తం ఎక్కించారు. ఇక, 2027లో పార్టీ ప్లీనరీ ఉంటుందని.. ఆ తర్వాత వైఎస్ జగన్ పాదయాత్ర 2.0 ఉంటుందని పార్టీ కీలక నేతలు ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. దీంతో ఈసారి జగన్ పాదయాత్ర ఎలా ఉండబోతోంది..? ఎక్కడ్నుంచి మొదలవుతుంది..? రూట్ మ్యాప్ ఎలా ఉంటుందన్న పార్టీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎన్నికలకు ముందు పాదయాత్ర ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు అధికారంలోకి రావటానికి సక్సెస్ ఫార్ములాగా మారిపోయింది. గతంలో వైఎస్ఆర్, చంద్రబాబు, జగన్, లోకేష్‌లు పాదయాత్రలు చేసి అధికారంలోకి వచ్చారు. పాదయాత్ర 2.0 ద్వారా 2029 ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరేయాలని జగన్ భావిస్తున్నారు. 2017 నవంబర్ 6న కడప జిల్లా ఇడుపులపాయలో ప్రజా సంకల్పయాత్ర మొదలుపెట్టారు జగన్. 2019 జనవరి 10న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగించారు. 341 రోజులు, 3,648 కిలోమీటర్లకుపైగా ఆ యాత్ర సాగింది. 13 జిల్లాలు, 134 అసెంబ్లీ నియోజకవర్గాలు, 231 మండలాలు, 2,516 గ్రామాలను కవర్ చేస్తూ ప్రజాసంకల్ప యాత్రను పూర్తి చేశారు జగన్. 55 ఆత్మీయ సమ్మేళనాలు, 124 బహిరంగ సభల్లో ప్రసంగించారు.
“దొంగ – పోలీస్” ఆట అంటూ హత్య.. తాళ్లతో కట్టి.. పెట్రోల్ పోసి..!
విశాఖపట్నంలోని పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ అనుమానాస్పద మృతి కేసులో బిగ్ ట్విస్ట్ వెలుగు చూసింది… అత్త కనకమహాలక్ష్మిని కోడలు హత్య చేసినట్లు నిర్ధారించారు పోలీసులు… దొంగ-పోలీస్ ఆట పేరుతో అత్తను కుర్చీకి తాళ్లతో బంధించి కోడలు… ఆ తర్వాత అత్తపై పెట్రోల్ పోసి నిప్పంటించి.. అగ్ని ప్రమాదం జరిగిందని అందరినీ నమ్మించే ప్రయత్నం కోడలు చేసింది… పోలీసులు లోతైన విచారణ చేపట్టడంతో అసలు విషయం వెలుగు చూసింది.. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న అనుమానాస్పద మృతి కేసు కీలక మలుపు తీసుకుంది.. కోడలే సినీ పక్కిలో ప్లాన్ ప్రకారమే అత్తను హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.. పెందుర్తి అప్పన్నపాలెంలో భార్యాభర్తలు సుబ్రహ్మణ్య శర్మ, లలిత, మనవడు, మనవరాలు, అత్త జయంతి కనకమాలక్ష్మి నివసిస్తున్నారు.. అత్తను మనవరాలుతో “దొంగ – పోలీస్” ఆట ఆడమని చెప్పి అత్తను కుర్చీకి కాళ్లను తాళ్లతో బంధించి, కళ్లకు గంతలు కట్టి కదలకుండా బంధించింది కోడలు.. అనంతరం కుర్చీలో కదలలేని పరిస్థితుల్లో ఉన్న అత్తపై పెట్రోల్ పోసి దేవుడి గదిలో ఉన్న దీపం విసిరి నిప్పంటించింది.. ప్రమాదవశాత్తు దీపం అంటు కొని అగ్ని ప్రమాదం జరిగిందని అందరికీ నమ్మించే ప్రయత్నం చేసింది కోడలు.. అయితే, మొదట అగ్ని ప్రమాదంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పెందుర్తి పోలీసులు.. తమదైన శైలిలో దర్యాప్తు చేయగా అసలు గుట్టు బయటపడింది.. తనపై అనవసరంగా చిరాకు పడుతున్నారని కారణంతోనే అత్తను హతమార్చినట్లు పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం.
అమరావతికి వస్తా.. చర్చకు సిద్ధమా?.. వైసీపీ నేతలకు ఆదినారాయణ రెడ్డి సవాల్..
బీజేపీ ఎమ్మెల్యే అదినారాయణ రెడ్డి.. వైసీపీ నేతలకు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. అమరావతికి వస్తున్నా.. చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు.. బుధవారం లేదా గురువారం అమరావతికి వస్తానని ప్రకటించారు.. ఈనెల 4న రాష్ట్రంలో అభివృద్ధి, వైసీపీ అవకతవకలపై మాట్లాడాను.. నాపై వ్యక్తిగతంగా రకరకాలుగా రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి, రామసుబ్బారెడ్డి చాలా కామెంట్లు చేసారు.. నేను మాట్లాడిన దానికి సమాధానం చెప్పకుండా, జగన్ మెప్పు కోసం సంబంధం లేని మాటలు మాట్లాడారని మండిపడ్డారు.. విశాఖ సమ్మిట్ లో పది లక్షల కోట్ల పెట్టుబడులు, పది లక్షల ఉద్యోగాలు వస్తాయి.. కానీ, మీ బ్రతుకంతా SIT ఎదుట అటెండ్ అవడానికే సరిపోతోందని ఎద్దేవా చ ఏశారు.. నేను వైసీపీ ఆఫీసుకు రమ్మన్నా వస్తా… చర్చకు సిద్ధం.. అని ప్రకటించారు.. R కాంగ్రెస్ పోయింది, I కాంగ్రెస్ పోయింది, Y కాంగ్రెస్ కూడా పోతుంది… వైసీపీ ఈ రాష్ట్రంలో ఉండదు… ఆకాశం అంత సంపాదన మీది.. మీరు చేసిన సాయం ఆవగింజంత అని విమర్శించారు ఆది నారాయణరెడ్డి.. రాజారెడ్డి మిలిటరీలో వంట మాస్టర్ గా చేసింది కూడా చెప్పాలి.. మా కుటుంబం ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చాక జనతా పార్టీ అభ్యర్ధిగా టికెట్ తెచ్చుకున్నా… రామసుబ్బారెడ్డి రిగ్గింగ్ చేస్తుంటే.. నేను గెలిచాను అన్నారు.. అమరావతి, పోలవరం, రైల్వేజోన్, ప్రైవేటు కంపెనీల పెట్టుబడులూ ఆపలేరు… జైలుకు పోకుండా ఆగలేరు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.. చెత్త సంప్రదాయంతో మీరు నాకు కౌంటర్ ఇచ్చారు.. ఏ కేసులూ మీరు ఆపలేరు… టైంపాస్ కాదు.. రాష్ట్రం బాగుపడాలి అన్నారు.. ఇక, మన్మోహన్ సింగ్ వదిలిన 11వ స్ధానం నుంచి దేశం 2వ స్ధానానికి రానుంది అని వెల్లడించారు.
ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు- ఆకట్టుకుంటున్న సైకత శిల్పం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఈరోజు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ నాయకురాలు విజయారెడ్డి ఆధ్వర్యంలో పీవీ మార్గ్ లోని ఎన్టీయార్ గార్డెన్ దగ్గర జరిపిన సంబరాల్లో పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి కేక కట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు.. ప్రజలకు మరింత సుభిక్షంగా పాలన అందించేందుకు, రాబోయే కాలంలో కూడా ప్రజల ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రాన్నిఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు రేవంత్ రెడ్డికి మరింత శక్తిని ఇవ్వాలని ప్రార్థించారు. ఇక, ప్రముఖ సైకత శిల్పి వరప్రసాద్.. హుస్సేన్ సాగర్ తీరాన సీఎం రేవంత్ రెడ్డి సైకత శిల్పాన్ని రూపొందించారు. ఈ సందర్భంగా వరప్రసాద్ ను మంత్రి జూపల్లి అభినందించారు.
మోడీ కారణంగా నా ర్యాలీ ఆలస్యమైంది.. ఖర్గే ఆరోపణలు
బీహార్‌లో రెండో విడత పోలింగ్ కోసం ఉధృతంగా ప్రచారం సాగుతోంది. అన్ని పార్టీలకు చెందిన అగ్ర నాయకులంతా ర్యాలీలు, బహిరంగ సభలతో జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. ఓ వైపు ప్రధాని మోడీ, అమిత్ షా, కేంద్రమంత్రులు ప్రచారం చేస్తుండగా.. ఇంకోవైపు రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, మల్లిఖార్జున ఖర్గే లాంటి అగ్ర నేతలంతా ప్రచారం చేస్తున్నారు. ప్రధాని మోడీ కారణంగా రెండు గంటల పాటు ఎన్నికల ప్రచారానికి అంతరాయం కలిగిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆరోపించారు. శుక్రవారం రోహ్తాస్ జిల్లాలోని చెనారిలో ఖర్గే ఎన్నికల ర్యాలీ ఉంది. అదే సమయంలో ఔరంగాబాద్, కైమూర్ జిల్లాల్లో మోడీ ర్యాలీలు ఉన్నాయి. పొరుగునే రోహ్తాస్ ఉంది. అదే సమయంలో మోడీ విమానం టేకాఫ్ అవుతుండగా.. ఖర్గే హెలికాప్టర్‌ను రెండు గంటల పాటు నిలిపివేశారు. ఈ నేపథ్యంలో ఖర్గే తీవ్ర ఆరోపణలు చేశారు. మోడీ కారణంగానే తన ఎన్నికల ప్రచారానికి ఇబ్బంది తలెత్తిందన్నారు.
యువతకు బీజేపీ ల్యాప్‌టాప్‌లు ఇస్తుంటే.. ఆర్జేడీ రివాల్వర్లు ఇస్తోంది.. విపక్షంపై మోడీ విమర్శలు
ఇండియా కూటమి లక్ష్యంగా మరోసారి ప్రధాని మోడీ విమర్శలు గుప్పించారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సీతామర్హిలో జరిగిన బహిరంగ సభలో మోడీ మాట్లాడారు. యువతకు మేము ల్యాప్‌టాప్‌లు ఇస్తుంటే.. ఆర్జేడీ రివాల్వర్లు ఇస్తోందని విరుచుకుపడ్డారు. తొలి దశ ఎన్నికల్లో జంగిల్ రాజ్‌కు ప్రజలు గట్టి బుద్ధి చెప్పారన్నారు. తేజస్వి యాదవ్ ఒక పిల్లవాడు అని.. ముఖ్యమంత్రైతే ‘రంగ్‌దార్’ (రౌడీ) అవుతారని వ్యాఖ్యానించారు. ‘‘బీహార్ పిల్లల కోసం ఆర్జేడీ ఏమి చేయాలనుకుంటుందో వారి నాయకుల ఎన్నికల ప్రచారాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ జంగిల్ రాజ్ మద్దతుదారుల పాటలు, నినాదాలు వినండి. వారి మాటలకు ప్రజలు భయపడిపోతున్నారు. అమాయక పిల్లలను ఆర్జేడీ వేదికలపై గ్యాంగ్‌స్టర్లుగా మారాలనుకుంటున్నారని చెప్పమని బలవంతం చేస్తున్నారు.’’ అని మోడీ పేర్కొన్నారు. ఇకపై బీహారీయులు తుపాకీ ప్రభుత్వాన్ని కోరుకోవద్దని.. వాళ్లకు ఓటు వేస్తే ప్రమాదమని మోడీ హెచ్చరించారు.
వివేక్ రామస్వామిపై ట్రంప్ ప్రశంసలు.. గవర్నర్ ఎన్నికల్లో మద్దతు
ఇండియన్-అమెరికన్ వివేక్ రామస్వామిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసలు వర్షం కురిపించారు. వివేక్ తనకు బాగా తెలుసని.. చాలా ప్రత్యేకమైన వ్యక్తి అంటూ కొనిడాయారు. వివేక్ రామస్వామి ఒహియో గవర్నర్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ట్రంప్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ‘‘వివేక్ యువకుడు, బలమైనవాడు, తెలివైనవాడు. చాలా మంచి వ్యక్తి. దేశాన్ని నిజంగా ప్రేమించే వ్యక్తి. ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడానికి, పన్నులు, నిబంధనలను తగ్గించడానికి, మేడ్ ఇన్ ది యూఎస్ఎను ప్రోత్సహించడానికి. ఛాంపియన్ అమెరికన్ ఎనర్జీ డామినెన్స్‌ను ప్రోత్సహించడానికి. సురక్షితమైన సరిహద్దులను కాపాడటానికి.. భద్రంగా, వలస నేరాలను అరికట్టడానికి. మన సైనిక, అనుభవజ్ఞులను బలోపేతం చేయడానికి అవిశ్రాంతంగా పోరాడుతారు.’’ అంటూ ట్రంప్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. ‘‘వివేక్ రామస్వామి ఒహియోకు గొప్ప గవర్నర్ అవుతారు. నా పూర్తి ఆమోదం ఉంది. మిమ్మల్ని ఎప్పటికీ నిరాశపరచడు!, 2016, 2020, 2024ల్లో నేను కూడా పెద్ద విజయం సాధించాను’’ అంటూ ట్రంప్ తెలిపారు.
2025లో 1.9 మిలియన్ ఉద్యోగుల తొలగింపు.. 22 ఏళ్లలో ఇది అత్యధికం..!
అగ్ర రాజ్యం అమెరికాలో ఉద్యోగులు తమ జాబ్ ఉంటుందో.. ఊడుతుందో కూడా తెలియని పరిస్థితిల్లో ఉన్నారు.. ఈ ఏడాదిలో ఏకంగా వన్ మిలియన్‌కు పైగా ఉద్యోగాలను ఇంటికి పంపించేశాయి ఆయా సంస్థలు.. అమెరికన్ ఉద్యోగ మార్కెట్ సంవత్సరాలలో అత్యంత అనిశ్చిత క్షణాల్లో ఒకటిగా చెబుతున్నారు.. ప్రైవేట్ కన్సల్టింగ్ సంస్థ ఛాలెంజర్, గ్రే & క్రిస్మస్ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. అమెరికా కంపెనీలు అక్టోబర్‌లో 153,074 ఉద్యోగాల కోతలను ప్రకటించాయి, ఇది సెప్టెంబర్‌లో నమోదైన సంఖ్య కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ. దీనితో 2025లో మొత్తం తొలగింపుల సంఖ్య 1.09 మిలియన్లకు పైగా పెరిగింది.. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 65 శాతం అధికం.. 2020 తర్వాత సంవత్సరం నుండి ఇప్పటి వరకు అత్యధిక మొత్తం అని ది వాల్ స్ట్రీట్ జర్నల్ (WSJ) నివేదికలో పేర్కొంది.. ఈ దారుణమైన సంఖ్య, అధికారిక ఉద్యోగాల డేటాను స్తంభింపజేసిన కొనసాగుతున్న యూఎస్ ప్రభుత్వ షట్‌డౌన్‌తో కలిసి, ఆర్థికవేత్తలు ప్రైవేట్ రంగ ఆధారాలను ఉపయోగించి కార్మిక మార్కెట్ నుంచి పూర్తి డేటాను సేకరించే ప్రయత్నం చేస్తున్నారు.. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ప్రస్తుత ఉద్యోగుల తొలగింపులకు పలు కారణాలు ఉన్నాయి.. పన్నులతో పెరుగుతున్న ఖర్చులు, వినియోగదారుల డిమాండ్ మందగించడం.. పరిశ్రమలలో కృత్రిమ మేధస్సు (ఏఐ), ఆటోమేషన్ వైపు వేగంగా మొగ్గు చూపడంగా అంచనా వేస్తున్నారు.. డిమాండ్ తగ్గడం, ఇన్‌పుట్ ఖర్చులు పెరగడం లేదా AI స్వీకరణ కారణంగా, చాలా కంపెనీలు తక్కువ మందితో పనిచేసేందుకు నిర్ణయం తీసుకుంటున్న నేపథ్యంలో ఈ పరిణామాలని EY-పార్థెనాన్ చీఫ్ ఎకనామిస్ట్ గ్రెగొరీ డాకో పేర్కొన్నారు.. ఇది ఒక్కసారి మాత్రమే జరిగే విషయం కాదు, ఇది కార్మిక మార్కెట్‌పై దీర్ఘకాలిక ప్రభావం చూపుతుందన్నారు.. ఆర్థిక మందగమన భయాల మధ్య సిలికాన్ వ్యాలీ నుండి వాల్ స్ట్రీట్ వరకు వర్క్‌ను ఆటోమేట్ చేయడం మరియు నియామకాలను తగ్గించడంతో టెక్ మరియు వైట్ కాలర్ రంగాలు కోతల భారాన్ని ఎదుర్కుంటున్నాయంటున్నారు..
ఇండియన్ మార్కెట్‌లోకి మినీ కంట్రీయ్యాన్ SE All4.. అదిరిపోయే ఫీచర్స్‌తో ఎలక్ట్రిక్ SUV.. పూర్తి వివరాలు..
భారత మార్కెట్లోకి మినీ కంట్రీమ్యాన్ SE All4 ఎలక్ట్రిక్ SUVవి కారు వచ్చేసింది.. రూ. 66.90 లక్షల (ఎక్స్–షోరూమ్) ప్రారంభ ధరతో దీనిని విడుదల చేశారు.. JCW థీమ్ వేరియంట్లో లభించే ఈ మోడల్‌కి బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ వాహనం CBU (Completely Built Unit) రూపంలో దిగుమతి అవుతుంది, డెలివరీలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. 2025 కంట్రీమ్యాన్ SE All4 కొత్త డిజైన్‌తో ఆకట్టుకుంటోంది. రీడిజైన్ చేసిన గ్రిల్, కొత్త హెడ్‌ల్యాంప్‌లు, మరింత స్పష్టంగా తీర్చిదిద్దిన బానెట్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, జెట్ బ్లాక్ రూఫ్ వాహనానికి స్పోర్టీ లుక్ ఇస్తాయి. JCW ట్రిమ్‌లో భాగంగా బ్లాక్ స్ట్రిప్స్, రూఫ్ రైల్స్, 19-అంగుళాల అల్లాయ్ వీల్స్, మరియు వీల్ ఆర్చ్ క్లాడింగ్ లభిస్తాయి. కలర్ ఆప్షన్లు లెజెండ్ గ్రే మరియు మిడ్‌నైట్ బ్లాక్, ఇవి రెండూ జెట్ బ్లాక్ రూఫ్ మరియు మిర్రర్ క్యాప్స్తో అందుబాటులో ఉన్నాయి. LED డే టైమ్ రన్నింగ్ లైట్స్ (DRLs), హెడ్‌లైట్స్ మరియు టెయిల్‌లైట్స్‌లో అనుకూలీకరించదగిన సిగ్నేచర్ మోడ్‌లు ఉన్నాయి. కేబిన్‌లో JCW ప్రత్యేకతలతో కూడిన స్టీరింగ్ వీల్, స్పోర్ట్స్ సీట్లు, మరియు ప్రీమియం ట్రిమ్ ఫినిష్‌లు ఉన్నాయి. డ్రైవర్ సీటు పవర్ అడ్జస్టబుల్‌గా ఉండగా, ఇంటీరియర్‌లో రీసైకిల్ చేసిన 2D నిట్ ఫాబ్రిక్, యాంబియంట్ లైటింగ్, మరియు పనోరమిక్ గ్లాస్ రూఫ్ లభిస్తాయి. ఇతర ముఖ్య ఫీచర్లలో హెడ్-అప్ డిస్ప్లే, వైర్‌లెస్ ఫోన్ మిర్రరింగ్, క్రూయిజ్ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా, మరియు హార్మన్ కార్డాన్ ఆడియో సిస్టమ్ ఉన్నాయి. భద్రత కోసం ఎయిర్‌బ్యాగ్‌లు మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) అందించబడ్డాయి. మినీ కంట్రీమ్యాన్ SE All4లో డ్యూయల్ మోటార్ సెటప్ ఉంది, ఇది మొత్తం 313 hp పవర్ మరియు 494 Nm టార్క్ అందిస్తుంది. ఇది పెట్రోల్ వెర్షన్ అయిన కంట్రీమ్యాన్ JCW (300 hp / 400 Nm) కంటే ఎక్కువ శక్తివంతమైనది. ఈ వాహనం 0 నుండి 100 కిమీ వేగాన్ని కేవలం 5.6 సెకన్లలో చేరుతుంది. గరిష్ట వేగం 180 కిలో మీటర్లుగా పేర్కొన్నారు..
నవ్వేవాళ్ళు నవ్వనీ.. ఏడ్చేవాళ్ళు ఏడ్వనీ.. డోంట్ కేర్!
ఈ మధ్యకాలంలో సమంత చేస్తున్న సినిమాల కంటే కూడా, ఎక్కువగా రాజ్ నిడుమోరుతో ఉన్న రిలేషన్ గురించే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఒకపక్క నాగచైతన్య, శోభితను వివాహం చేసుకున్న తర్వాత, సమంత, రాజ్ నిడుమోరుతో డేటింగ్ చేస్తోందన్న వార్తలు అనూహ్యంగా తెర మీదకు వచ్చాయి. ఈ విషయాన్ని సమంత సహా, రాజ్ నిడుమోరు ఎప్పుడూ ఖండించలేదు. దానికి తగ్గట్టుగానే, ఈమధ్య కాలంలో సమంత, ఆయనతో ఎక్కువగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. ఇక తాజాగా ఒక ముంబై ఈవెంట్ ఫోటో అయితే, త్వరలోనే వీరిద్దరూ అధికారికంగా రిలేషన్‌లో ఉన్నట్లు అనౌన్స్ చేస్తారా, పెళ్ళికి అడుగులు వేస్తున్నారా అనే అనుమానాలు కలిగించేలా ఉంది. రాజ్ నిడుమోరుని హగ్ చేసుకుని ఉన్నట్టుగా ఉన్న ఒక ఫోటోను, సమంత సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. అంతేకాకుండా, “స్నేహితులు, కుటుంబ సభ్యులతో చుట్టుముట్టబడి ఉన్నాను. గత ఏడాదిన్నర కాలంలో, నేను నా కెరీర్‌లో కొన్ని సాహసోపేతమైన అడుగులు వేశాను. రిస్క్‌లు తీసుకోవడం, నా అంతర్ దృష్టిని నమ్మడం మరియు నేను ముందుకు సాగుతున్నప్పుడు నేర్చుకోవడం. ఈ రోజు, నేను చిన్న విజయాలను జరుపుకుంటున్నాను. నేను కలిసిన అత్యంత తెలివైన, కష్టపడి పనిచేసే మరియు అత్యంత ప్రామాణికమైన వ్యక్తులతో కలిసి పనిచేయడం నాకు చాలా కృతజ్ఞతగా ఉంది. చాలా నమ్మకంతో, ఇది ప్రారంభం మాత్రమే అని నాకు తెలుసు,” అని సమంత పోస్ట్ చేసింది. మొత్తంగా చూసుకుంటే నవ్వేవాళ్ళు నవ్వనీ.. ఏడ్చేవాళ్ళు ఏడ్వనీ.. డోంట్ కేర్! అన్నట్టుగా సమంత తనకు నచ్చింది నచ్చినట్టు చేసుకు పోతోంది అనే చెప్పాలి.
ఆ సమస్యను రాజకీయం చేయడం ఆపేయండి.. మీ కాళ్ళు మొక్కుతా!
కోలీవుడ్ నటుడు విశాల్ ఓ వైపు వరుస సినిమాల్లో నటిస్తూనే మరోవైపు నడిగర్ సంఘం బిల్డింగ్ నిర్మాణ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే, ఇటీవల డైరెక్టర్ తో వివాదడం ఏర్పడగా.. ‘మకుటం’ చిత్రాన్ని విశాల్ సొంతంగా తెరకెక్కిస్తున్నారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా అతడు నిత్యం యాక్టివ్‌గా కనిపిస్తాడు. అయితే, గత నెలలో కోయంబత్తూర్‌లో జరిగిన అత్యాచార ఘటనపై విశాల్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఓ సంచలన పోస్ట్ పెట్టారు. ఆ సమయంలో బాధితురాలు ఆ ప్రదేశంలో ఉన్నందుకు ఆమెను నిందించడం దయచేసి ఆపండి.. మన దేశంలో పునరావృతమయ్యే ఈ రక్తసిక్తమైన అత్యాచారం అనే సమస్యను రాజకీయం చేయడం ఆపండి.. ఈ విషయంపై చర్చించకుండా ఉండేందుకు మీ కాళ్ళు మొక్కుతాను అని విశాల్ కోరారు.
హీరోయిన్ అవకుండానే యాడ్.. లక్షణంగా ఉంది బాసూ
త్వరలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్న జాన్వీ ఘట్టమనేని, ఇప్పుడు ఇంకా హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వకుండానే ఒక జువెలరీ యాడ్‌లో కనిపించనుంది. కౌశిక్ గోల్డ్ & డైమండ్స్ యాడ్‌లో జాన్వీ స్వరూప్ ఘట్టమనేని నటించారు. తెరపై ఆమె నటించిన తొలి ప్రచార చిత్రం ఇదే కావడం విశేషం.నటి, దర్శకురాలు మంజుల ఘట్టమనేని కుమార్తెగా, లెజెండరీ సూపర్ స్టార్ కృష్ణ మనవరాలిగా, జాన్వీ ఒక కొత్త తరంగా మన ముందుకు వస్తుంది. బ్రాండ్ టీం, జాన్వీ ఫోటోలను సోషల్ మీడియాలో చూసి ఆమెను అప్రోచ్ అయినట్టు తెలుస్తోంది. ఈ మధ్యనే జాన్వీ పుట్టినరోజు సందర్భంగా, ఆమె హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు అధికారిక ప్రకటన చేశారు. ఇక హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వకముందే, ఆమెతో ఒక బ్రాండ్ యాడ్ చేయించడం ఆసక్తికరమైన విషయం అని చెప్పాలి. త్వరలోనే ఆమె ఒక బడా ప్రాజెక్టులో భాగం కాబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆమెను లాక్ చేశారని, త్వరలోనే దానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఉండే అవకాశం ఉందని అంటున్నారు.