TET Hall Tickets: టీఎస్ టెట్ అభ్యర్థులు నేటి (బుధవారం) నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎస్సీఈఆర్టీ అధికారులు ఈ నెల 20 నుంచి జూన్ 2వరకు టెట్ నిర్వహించనున్నారు.
తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో 65.67 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా భువనగిరి 76.78 శాతం, అత్యల్పంగా.. హైదరాబాద్ 48.48 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు చెప్పారు. తెలంగాణలో 2019 లోక్సభ ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్ శాతం స్వల్పంగా పెరిగింది. 2019లో రాష్ట్రంలో 62.77 శాతం ఓటింగ్ నమోదైంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో సిట్టింగ్ ఎమ్మెల్యే మృతి చెందడంతో ఉప ఎన్నిక జరిగింది. అసెంబ్లీ నియోజకవర్గంలో 50.34% ఓటింగ్ నమోదైంది.
పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ పార్లమెంటు సీటు కాంగ్రెస్ గెల్చుకుంటుందని ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 11 ఎంపీ సీట్లను గెలుస్తుందని తెలిపారు. మరోవైపు.. బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి బీ టీంమ్ అని ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని విమర్శించారు. కేసీఆర్ ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అని అన్నారు. నిన్న తెలంగాణలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలు పువ్వు గుర్తుకు ఓటెయ్యమని చెప్పడం నిదర్శనం…
బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఫైరయ్యారు. లక్ష్మణ్ పొలిటికల్ చిప్ ఖరాబైందని.. తక్షణమే రిపేర్ చేసుకుని మాట్లాడాలని సూచించారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ దృష్టి పెట్టింది. కాగా.. రేపు తెలంగాణ భవన్లో నల్గొండ, వరంగల్, ఖమ్మం నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి గులాబీ బాస్ కేసీఆర్ హాజరు కానున్నారు. తమకు సిట్టింగ్ స్థానంగా ఉన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని దక్కించుకోవాలని బీఆర్ఎస్ యోచనలో ఉంది. ఈ క్రమంలోనే.. కేసీఆర్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు.