నేటి ఉదయం 10 గంటలకు తెలంగాణ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు.. తర్వాత కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ పట్ల వివక్షపై చర్చ, తీర్మానం.. రైతు రుణమాఫీపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ..
నేడు ఎక్సైజ్ శాఖపై శ్వేతపత్రం విడుదల.. సభలో శ్వేతపత్రం విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు.. మద్యం కుంభకోణంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న సీఎం..
నేడు ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర వైసీపీ ఆందోళన.. ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వైఎస్ జగన్ నిరసన.. జంతర్ మంతర్ దగ్గర వైసీపీ నిరసనకు పోలీసుల అనుమతి.. ఏపీలో హింసాత్మక ఘటనలను నిరసిస్తూ ఢిల్లీలో వైసీపీ నిరసన.. ధర్నాలో పాల్గొననున్న వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు..
నేటి సాయంత్రం 4. 30 గంటలకు సీఎం చంద్రబాబు కీలక సమావేశం.. హాజరుకానున్న మంత్రులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు, శాఖాధిపతులు..
నేడు తాడేపల్లిగూడెంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యటన.. తాడేపల్లిగూడెం రూరల్ మండలం నందమూరు గ్రామం ముంపు ఎర్ర కాలువ ముంపు ప్రాంతాల్లో పర్యటన.
నేడు తిరుమలలో అక్టోబర్ నెల ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల.. నేటి ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్న టీటీడీ..
నేడు తిరుమలలో పల్లవోత్సవం.. మైసూర్ మహారాజు జయంతి సందర్భంగా.. కర్ణాటక చౌల్ట్రీ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించనున్న టీటీడీ..
నేడు పార్లమెంట్ హౌస్‌లో రైతు నేతల బృందంతో రాహుల్ గాంధీ భేటీ..
నేడు పార్లమెంట్ లో నిరసన తెలియజేయాలని ఇండియా కూటమి నిర్ణయం.. బడ్జెట్ లో అభివృద్ధికి సంబంధించిన అంశాలు ఏమి లేవంటూ మండిపాటు..