మోహన్ బాబు యూనివర్సిటీ మొదటి స్నాతకోత్సవంకు రావడం నా అదృష్టమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఏపీలోని చంద్రగిరిలో శ్రీ విద్యానికేతన్ 13వ గ్రాడ్యుయేషన్ డే, ఎంబీయూ మొదటి స్నాతకోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు, ఛైర్మన్ మంచు మోహన్ బాబు హాజరయ్యారు.
Social Media Posts: అసెంబ్లీ స్పీకర్ పై అనుచిత పోస్టులు చేసిన వ్యక్తిని సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. వికారాబాద్ మోమిన్ పేట కు చెందిన విజయ్ కుమార్ అనే వ్యక్తి తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాలలో స్పీకర్ మాట్లాడిన వీడియోలను సేకరించాడు.
హైదరాబాద్‌లో తమ సంస్థ విస్తరణకు మోనార్క్ ట్రాక్టర్స్ సంస్థ ముందుకు వచ్చింది. హైదరాబాద్‌లోని తమ పరిశోధన-అభివృద్ధి సంస్థను విస్తరించే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో సంస్థ ప్రతినిధులు చర్చించారు.
తూర్పు తీర ప్రాంతంలో సమాంతరంగా మరో కొత్త రైలు కారిడార్‌కు గ్రీన్‌సిగ్నల్ పడింది. ప్రస్తుతం ఉన్న విజయవాడ-విశాఖ-భువనేశ్వర్-కోలకతా రైల్వే కారిడార్‌కు ప్రత్యామ్నాయంగా కొత్త రైలు కారిడార్‌ను కేంద్రం నిర్మించినుంది.