* నేడు మహబూబ్ నగర్ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి.. మధ్యాహ్నం 12 గంటలకు సీసీకుంట మండలంలో పర్యటన.. ఎమ్మె్ల్యే మధుసూదన్ రెడ్డి తండ్రి దశదినకర్మకు.. హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి.
* నేడు పీసీసీ చీఫ్ గా మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతల స్వీకరణ.. గచ్చిబౌలి నుంచి గాంధీ భవన్ వరకు ర్యాలీ.. గన్ పార్క్ దగ్గర నివాళులర్పించనున్న టీపీసీసీ చీఫ్..
* నేడు మాజీ ఎంపీ నందిగం సురేష్ కు పోలీస్ కస్టడీ.. 2 రోజులు పోలీసుల కస్టడీకి అనుమతించిన మంగళగిరి కోర్టు.. ఇవాళ మ.12 గంటల నుంచి ఎల్లుండి మధ్యాహ్నం 1గంట వరకు.. నందిగం సురేష్ ను ప్రశ్నించనున్న పోలీసులు..
* నేడు ఛలో విజయవాడకు పీహెచ్సీ వైద్యుల సంఘం పిలుపు.. పీజీ వైద్య విద్యలో ఇన్ సర్వీస్ కోటాను తగ్గించడంపై పీహెచ్సీ వైద్యుల నిరసన.. ఎల్లుండి పీహెచ్సీ వైద్యుల నిరవధిక నిరాహార దీక్ష.. ఇప్పటికే ఆస్పత్రుల్లో ఓపీ సేవలను నిలిపివేసిన పీహెచ్సీ వైద్యులు..
* నేడు ప్రశాశం బ్యారేజీలో 6వ రోజు బోట్ల తొలగింపు ప్రక్రియ.. నది నుంచి బోట్లను బయటకు తీసేందుకు ప్రయత్నాలు.. నిపుణులతో చర్చించి నేడు మళ్లీ బోట్ల తొలగింపు ప్రక్రియ చేపట్టాలని నిర్ణయం..
* నేడు గాజువాక జంక్షన్లో మహాధర్నా.. స్టీల్ ప్లాంట్ రక్షణ దిశగా కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్.
* నేడు అమలాపురంలో రెండోవ రోజు 11వ ఆంధ్ర ప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ పోటీలు.. ఏపీ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ మెన్ అండ్ ఉమెన్ విభాగాలలో పోటీలు.
* నేడు శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరంలో జరిగే బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి సత్య కుమార్ యాదవ్.
* నేడు బైంసాలో గణేష్ నిమజ్జనం.. శోభాయాత్ర సందర్భంగా భారీ పోలీస్ భద్రత.. గడ్డెన్న వాగు ప్రాజెక్టు దగ్గర నిమజ్జన ఏర్పాట్లు.. 600 మంది పోలీసులతో భారీ బందోబస్తు.
* నేడు తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు పడే అవకాశం.. ఏపీకి మరో మూడు రోజుల పాటు వర్ష సూచన.. ఈ నెల 23న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఈ నెల 28 నాటికి తీవ్ర వాయుగండంగా బలపడే అవకాశం..
* నేడు మూడు రాష్ట్రాల పర్యటనలో ప్రధాని మోడీ పర్యటన.. జార్ఖండ్, గుజరాత్, ఒడిశాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.