Boy Kidnap: జగిత్యాల జిల్లా మెట్పల్లిలో బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. పట్టణంలోని దుబ్బవాడలో నివాసం ఉంటున్న లక్ష్మీ, రాజుల రెండేళ్ల కుమారుడు శివ తన అక్కతో కలిసి కిరాణా షాపుకు నడుచుకుంటూ వెళ్తుండగా.. ద్విచక్ర వాహనంపై ఓ వ్యక్తి వెంబడిస్తూ కొద్ది దూరం వెళ్లాడు. ఆ తర్వాత అక్కకు 20 రూపాయలు ఇచ్చి ఏదైనా కొనుక్కు రావాలని చెప్పడంతో ఆ పాప అక్కడి నుంచి కిరాణం షాప్‌కు వెళ్లేలోపే బాలుడిని బైక్‌పై ఎక్కించుకొని గుర్తుతెలియని వ్యక్తి…
ఇవాళ ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ హైదరాబాద్ క్యాంపస్‌కు శంకుస్థాపన జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అమెరికా పర్యటనలో భాగంగా కాగ్నిజెంట్ కంపెనీ సీఈవో రవికుమార్‌తో చర్చలు జరిపారు. న్యూజెర్సీలో ఈనెల 5వ తేదీన రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందానికి అనుగుణంగా కాగ్నిజెంట్ కంపెనీ పది రోజుల్లోనే కొత్త క్యాంపస్ విస్తరణకు శ్రీకారం చుట్టింది.
నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఓపీ సేవల బంద్‌కు జూడాలు పిలుపునిచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా నేడు ఓపీ సేవలు బహిష్కరిస్తున్నట్లు జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. కోల్‌కతాలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనను నిరసిస్తూ 14వ తేదీన ఓపీ సేవలకు దూరంగా ఉంటున్నట్లు జూడాలు ప్రకటనలో వెల్లడించారు.
మూడో విడత రుణమాఫీ రేపు ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. మూడో విడత కింద రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు రుణమాఫీని రేపు ఖమ్మం జిల్లా వైరాలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఆ వెంటనే రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి.
AP Govt: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ స్థానికత కలిగిన ఉద్యోగులను ఏపీ సర్కార్ రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన ఉద్యోగులను తిరిగి వారి స్వరాష్ట్రానికి పంపేలా ఉత్తర్వులు ఇచ్చింది.
DSC Exam Key: తెలంగాణ రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నిర్వహించిన ఆన్ లైన్ డీఎస్సీ ప్రిలిమినరీ కీ విడుదల అయింది. ప్రిలిమినరీ కీతో పాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్ ను పాఠశాల విద్యా శాఖ అధికారులు వెబ్ సైట్ లో పెట్టారు.
Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నేటితో ముగియనుంది. రేవంత్ రెడ్డి రేపు హైదరాబాద్ రానున్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అమెరికా నుంచి పలువురు పారిశ్రామికవేత్తలు..