* నేడు తెలంగాణ సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ.. సాయంత్రం 4గంటలకు విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్..
* నేడు గుజరాత్ కు వెళ్లనున్న ఏపీ సీఎం చంద్రబాబు.. జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థల ప్రతినిధులతో చర్చల్లో పాల్గొననున్న చంద్రబాబు.
* నేడు రెండవ రోజు కొనసాగనున్న మాజీ ఎంపీ నందిగం సురేష్ పోలీస్ విచారణ..
* నేడు అన్నమయ్య జిల్లాలోని లక్కిరెడ్డిపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించనున్న రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.
* నేడు సత్తెనపల్లిలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ 5వ వర్ధంతి కార్యక్రమాలు.. పాల్గొననున్న మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ.
* నేడు మున్నేరు వద్ద వినాయక నిమ్మజ్జనం ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు.. కాలువ ఒద్దు, ప్రకాష్ నగర్ లో క్రేన్లు ఏర్పాటు.
* నేడు కొత్తగూడెంలోనీ ప్రకాశం స్టేడియంలో వ్యవసాయ సాంకేతిక ప్రదర్శన.. ప్రారంభించనున్న మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు
* నేడు పూజల తర్వాత ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనానికి ఏర్పాట్లు.. రేపు ఉదయం 6 గంటలకు ప్రారంభంకానున్న శోభాయాత్ర.. మధ్యాహ్నం ఒంటిగంటలోపు నిమజ్జనం పూర్తి చేయాలని యోచన..
* నేడు అహ్మదాబాద్ లో10 వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్న ప్రధాని మోడీ.. తెలుగు రాష్ట్రాల నుంచి మరో రెండు వందేభారత్ రైళ్లు.. విశాఖ- దుర్గ్, సికింద్రాబాద్-నాగ్ పూర్ మధ్య.. వందే భారత్ సర్వీసులను ప్రారంభించనున్న మోడీ..