KTR: కేటీఆర్ ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు
- నందినగర్ లోని కేటీఆర్ ఇంటి వద్ద భారీగా పోలీసుల బందోబస్తు..
- గ్రూప్ 1 అభ్యర్థులను కలుస్తారనే అనుమానంతో బందోబస్తు ఏర్పాటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: మధ్యాహ్నం 2 గంటలకు గ్రూప్ 1 పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు.ప్రధాన ప్రతిపక్ష నేత, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాసానికి పోలీసులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. బంజారాహిల్స్‌లోని నందినగర్‌లోని కేటీఆర్ ఇంటి వద్ద ఉదయం నుంచి పోలీసులు భారీగా మోహరించారు. గ్రౌప్ 1 అభ్యర్థులతో కేటీఆర్ కలుస్తారనే విశ్వనీయ సమాచారంతో ముందస్తు జాగ్రత్తగా కేటీఆర్ నివాసం వద్ద పోలీసులు చేరుకున్నారు. వందలాది మంది పోలీసులను మోహరించి, పదుల సంఖ్యలో పోలీసు వాహనాలను ఉంచారు. నందినగర్ ప్రాంతమంతా పోలీసు బలగాలతో నిండిపోయింది. గ్రూప్-1 మెయిన్స్‌ను వాయిదా వేయాలని అభ్యర్థుల పక్షాన విపక్షాలు నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మరికాసేపట్లో పరీక్ష ప్రారంభం కాబోతోంది.. దీనిపై రాజకీయ నిరసనలు వెల్లువెత్తడంతో పరీక్షలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. కేటీఆర్‌తో పాటు బీఆర్‌ఎస్ సీనియర్ నేతలు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, దుబ్బాక ఎమ్మెల్యే కోట ప్రభాకర్‌రెడ్డి తదితరులు ఇళ్ల బయట పహారా కాస్తున్నారు.
Bhatti Vikramarka: పవర్ కట్ పై ప్రభుత్వం ఫోకస్.. అత్యవసర సేవలకు ప్రత్యేక వాహనాలు
Also Read
తాజావార్తలు
-
Raptee.HV T30: రాప్టీ.హెచ్‌వి T30 ఎలక్ట్రిక్ బైక్.. 150KM రియల్ రేంజ్, కారు ఛార్జర్‌తో ఛార్జింగ్!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
-
Sangeet First Single: ఏఆర్ రెహమాన్ చేతుల మీదుగా ‘నీ వల్లే’ సాంగ్ రిలీజ్.. సిద్ శ్రీరామ్ మెలోడీకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్!
-
Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
ట్రెండింగ్
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!