AP Deputy CM: హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయల విరాళం అందించారు.
Central Team: నేటి నుంచి వరద నష్టంపై తెలంగాణలో కేంద్ర బృందం పర్యటించబోతుంది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (NDMA) సలహాదారు, కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ (ఆపరేషన్స్& కమ్యూనికేషన్స్) కల్నల్ కీర్తి ప్రతాప్ సింగ్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కేంద్ర బృందం.. హైదరాబాద్ లోని సచివాలయంలో సీఎస్ శాంతికుమారితో సమావేశం కానుంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) కొత్త అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఇవాళ (బుధవారం) ఢిల్లీకి వెళ్లనున్నారు. అధిష్ఠానం పెద్దలను కలిసి తనను అధ్యక్షుడిగా నియమించినందుకు ధన్యవాదాలు తెలియజేయనున్నారు.