విద్యా సంవత్సరానికి గాను బీ-ఫార్మసీ/ ఫార్మ్ డీ/ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్, బయో టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశానికి మొదటి దశ వెబ్ ఆధారిత కౌన్సెలింగ్లో మొత్తం 10, 436 సీట్లను కేటాయించారు. TGEAPCET (B) పరీక్షలో అభ్యర్థులు అర్హత సాధించారు.
గతవారం బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఇప్పుడు అల్పపీడనంగా మారింది, కానీ ఈ అల్పపీడనం కూడా మరింత బలహీనపడి ఆవర్తనంగా మారిపోయింది. వాతావరణశాఖ అధికారులు ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
ఏ కేటగిరిలోనూ ఛార్జీల పెంపు లేదని ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగా రావు వెల్లడించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 8 పిటిషన్లపై కమిషన్ తన అభిప్రాయాలను వెల్లడించిందని, అన్ని పిటిషన్ ల పై ఎలాంటి లాప్స్ లేకుండా వెల్లడించాలని నిర్ణయించిందన్నారు.
మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో ఆయిల్ ఫామ్ పెద్ద ఎత్తున సాగుచేయడం కోసం మన రాష్ట్రం లో 31 జిల్లాలకు అనుమతులు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో ఆయిల్ ఫెడ్ తో పాటుగా 14 ప్రయివేటు కంపెనీలు పామాయిల్ విస్తరణ కు ముందుకొచ్చాయని, ప్రతి ఉమ్మడి జిల్లాకి ఒక ఆయిల్ ఫెడ్ కేంద్రం ఉంటుందన్నారు.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 1500 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులను భర్తీకి చేయనుంది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ శాఖల్లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి మొత్తం 1500 ఖాళీలను భర్తీ చేయాలని యూబీఐ లక్ష్యంగా పెట్టుకుంది.
నోటికి వచ్చినట్లు మాట్లాడటం మాత్రమే సీఎం రేవంత్ రెడ్డికి తెలుసు అని, హామీలు అమలు చేయమని అడిగితే నోటికి వచ్చినట్లు సీఎం తిడుతున్నారన్నారు. కేసీఆర్ పధకాలను రేవంత్ రెడ్డి కొనసాగించడం లేదని, రెండు పంటలకు కేసీఆర్ రైతు బంధు ఇచ్చారని, రైతులకు రైతుబంధు రాలేదన్నారు. రాష్ట్రంలో పత్తి రైతులకు మద్దతు ధర రావడం లేదని హరీష్ రావు మండిపడ్డారు.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ శాఖలో పెద్ద మార్పులను ప్రారంభించారు. ఆయన పుట్టిన రోజునే 70 మంది డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఒకేసారి బదిలీ చేశారు. ఇటీవల రెవెన్యూ సంఘాలు ప్రమోషన్స్ , బదిలీలపై మంత్రిని కలిసి ప్రస్తావించడంతో, ఈ మార్పులు జరిగినాయి.
ఇవాళ తెలంగాణ భవన్లో నిర్వహించిన పీఏసీ సభ్యుల మీడియా సమావేశంలో ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. క్రిష్ణారెడ్డి, గీతారెడ్డిని పీఏసీ చైర్మన్లుగా చేశామని, కేంద్రంలో రాహుల్ గాంధీ సూచించిన కేసీ వేణుగోపాల్ పీఏసీ చైర్మన్ అయ్యారని ఆయన గుర్తు చేశారు.
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. ఇన్ని ఏళ్ళు దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అని, ఇప్పుడు ఓబీసీ కులగణన వీళ్లకు గుర్తుకు వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు.