జనావస సముదాయల్లో టపాసుల దుకాణాలు లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి ఒక పెద్ద వేడుక ఈ పండగ సందర్భంగా జరిగే అగ్నిప్రమాదాలు నివారించడానికి టపాసుల కాల్చేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.
మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా కేసుపై నేడు నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు విచారణ జరపనుంది. గత విచారణలో కేటీఆర్, దాసోజు శ్రవణ్ ల స్టేట్మెంట్ రికార్డ్ చేసిన కోర్టు.. ఈ రోజు మిగతా ముగ్గురు సాక్షులు తుల ఉమ, బాల్క సుమన్, సత్యవతి రాథోడ్ ల స్టేట్మెంట్లను కోర్టు రికార్డ్ చేయనుంది.
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని మూడు విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. హైదరాబాద్ నుండి చెన్నై వెళ్లాల్సిన రెండు ఇండిగో విమానాలు, చెన్నై నుండి హైదరాబాద్ వస్తున్న ఎయిర్ ఇండియా విమానాలకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఈ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సీఐఎస్ఎఫ్ వర్గాలు అప్రమత్తమయ్యాయి.
ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు బీసీ కులగణనపై కాంగ్రెస్ దృష్టి సారించింది. ఇవాళ గాంధీ భవన్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, కార్పొరేషన్ ఛైర్మన్లతో కీలక సమావేశం జరగనుంది. టీపీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది.
ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇటీవల పలు సమీక్షలను నిర్వహించారు. సోమవారం మేధావులతో సమావేశమై అభిప్రాయాలను స్వీకరించారు. మంగళవారం సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి ఇంటి నుండి వివరాలను సేకరించడంపై దృష్టి పెట్టాలని డిప్యూటీ సీఎం సూచించారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా లో ఇంజనీరింగ్ , లా కాలేజీలకు మంజూరైనున్నట్లు చిన్నారెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల విద్యాభివృద్ధి కోసం ఈ జిల్లాకు చాలా మేలు చేకూరుతుందని ఆయన అభిప్రాయపడుతున్నారు.
పోలీస్ సిబ్బందికి సరెండర్ లీవ్ లకు సంబంధించిన బడ్జెట్ ను రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో విడుదల చేసింది. పోలీస్ సిబ్బందికి సరెండర్ లీవ్‌ల బడ్జెట్‌గా రూ.182.48 కోట్లను విడుదల చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఇందిరా డెయిరీని రూపొందించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా మధిరలో ఇందిరా డెయిరీ లోగో ఆవిష్కరణ సందర్భంగా మహిళలను ఉద్దేశించి ఉపముఖ్యమంత్రి మాట్లాడారు.