జన్వాడ్ ఫాంహౌస్ పార్టీకి సంబంధించి రాజ్ పాకాలకు మోకిలా పోలీసులు నోటీసులు జారీ చేశారు. బీఎన్ఎస్ఎస్ 35(3) సెక్షన్ ప్రకారం నోటీసులు జారీ చేశారు. ఫాంహౌస్ పార్టీకి సంబంధించి విచారించాల్సి ఉందని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు తమ ముందు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు
మృత్యువులోనూ ఆ రక్త సంబంధం వీడలేదు. తమ్ముడి మృతిని తట్టుకోలేక అక్క గుండె ఆగిపోయింది. తమ్ముడి మరణాన్ని తట్టుకోలేక అక్క గుండెపోటుతో మృతి చెందిన విషాద ఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.
దీపావళి పండగ సందర్భంగా మట్టితో తయారు చేసిన దీపాంతలు వాడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలకు సూచించారు. రాష్ట్ర ప్రజలకు దీపావళి పండగ శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి సందర్భంగా దీపాలు వెలిగించేటప్పుడు మట్టితో తయారు చేసిన దీపాంతలు వాడాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
హైదరాబాద్ శివార్లలో జన్వాడలోని రాజ్ పాకాల ఫామ్ హౌస్ పార్టీ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. నేడు మరోసారి విజయ్ మద్దూరిని మోకిలా పోలీసులు విచారణ చేయనున్నారు. రాజ్ పాకాల ఇంకా పరారీలో ఉన్నారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో రైతులు ఆందోళనకు దిగారు. పత్తిరేటు తగ్గించడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల సెలవులు అనంతరం సోమవారం ప్రారంభం అయిన వ్యవసాయ మార్కెట్‌కు ఎక్కువ మొత్తంలో పత్తిని రైతులు తీసుకువచ్చారు.
హైదరాబాద్ నగరంలో నెల రోజుల పాటు పోలీస్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు చేశారు. నగరంలో అశాంతిని సృష్టించడానికి పలు సంస్థలు, పార్టీలు ప్రయత్నిస్తున్నాయని విశ్వసనీయ సమాచారం ఉందన్నారు.
పోలీస్ మాన్యువల్‌కు విరుద్ధంగా ఆందోళనలు చేపట్టిన టీజీఎస్పీ కానిస్టేబుళ్లపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన వైఖరి అవలంభించింది. తీవ్రమైన క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడుతున్న 10 మందిని గుర్తించి.. ఆర్టికల్ 311 ప్రకారం ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది. పదిమంది బెటాలియన్స్ కానిస్టేబుళ్లలను సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Road Accident: సంగారెడ్డి జిల్లా సదాశివపేట పేట వద్ద నేషనల్ హైవే 65పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముందు ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వచ్చి మరో లారీ ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ముందున్న లారీ టైర్ పంచర్ కావడంతో హైవే పక్కకు ఆపి పంచర్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రెండు లారీల మధ్యలో మృతదేహాలు ఇరుక్కుపోవడంతో బయటికి తీయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్ని అరగంట…