నేడు శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈదుపురంలో దీపం పథకాన్ని సీఎం ప్రారంభించనున్నారు. దీపం పథకంతో కోటి 50 లక్షల కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి. నేడు ఏలూరు ద్వారకా తిరుమల మండలంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఐయస్ జగన్నాధపురం శ్రీ లక్ష్మీనరసింహస్వామిని పవన్ దర్శించుకోనున్నారు. అనంతరం దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేయనునున్నారు. నేటి నుంచి తూర్పుగోదావరి జిల్లా రేషన్ షాపుల్లో కందిపప్పు, పంచదార, జొన్నలు పంపిణీ చేయనున్నారు. పాయింట్లకు…
తెలంగాణలోని అతి పురాతన ఆలయాల్లో ఒకటిగా పేరుగాంచిన దేవస్థానం శ్రీ కురుమూర్తి వేంకటేశ్వర దేవస్థానం. తిరుమల వేంకటేశ్వర ఆలయానికి, కురుమూర్తి ఆలయాని కి పోలికలున్నాయి. అమ్మాపూర్ గ్రామ సమీపంలో ఏడు కొండల మధ్య లక్ష్మీ సమేతంగా స్వయంభూగా వెలసిన స్వామి వారు పేదల తిరుపతిగా ఇక్కడ మొక్కులందుకుంటున్నారు. పూర్వం కురుమూర్తికి ‘కురుమతి’ పేరు ఉన్నట్లు ఆలయ చరిత్ర ప్రకారం తెలుస్తోంది. ఇక, పేదల తిరుపతిగా విలసిల్లుతున్న కురుమార్తి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఈ రోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. యాగశాల…
Telangana: తెలంగాణ ప్రభుత్వం దీపావళి పండుగ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త ప్రకటించింది. ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ (డీఏ) ను 3.64 శాతం పెంచుతూ సంబంధిత ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన డీఏ 2022 జులై 1వ తేదీ నుంచి అమల్లో ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. నవంబర్ జీతంతో పాటు ఈ పెరిగిన డీఏ చెల్లించనున్నారు. 2022 జులై 1 నుండి 2024 అక్టోబర్ 31 వరకు ఉన్న డీఏ బకాయిలను ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలో జమ…
Diwali 2024 : దీపావళి పండుగ సందర్భంగా క్రాకర్లు లేదా విద్యుత్ దీపాల కారణంగా సంభవించే అగ్ని ప్రమాదాలను ఎదుర్కోవడానికి తెలంగాణ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన , అగ్నిమాపక శాఖ రాష్ట్రవ్యాప్తంగా తన మొత్తం సిబ్బందిని అప్రమత్తం చేసింది. అగ్నిమాపక నియంత్రణ గదిలో పనిచేసే అధికారులు , స్టేషన్లలో పురుషుల సెలవులు రద్దు చేయబడ్డాయి , 24 గంటలూ అప్రమత్తంగా ఉంచబడ్డాయి. క్రాకర్లు కాల్చేటప్పుడు, దీపాలు లేదా కొవ్వొత్తులను వెలిగించేటప్పుడు , షార్ట్ సర్క్యూట్ల కారణంగా నివాస…
Caste Enumeration : రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సంబంధించిన సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల వివరాల సేకరణ కై ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కోసం క్షేత్రస్థాయిలో విస్తృత ఏర్పాట్లు చేయడం జరుగుతుందని అదిలాబాద్ జిల్లా జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఈ సందర్భంగా జైనద్ మండలం రైతువేధిక లో ఏర్పాటు చేసిన ఎన్యూమరెటర్లు, సూపర్వైజర్ ల శిక్షణా కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా ముఖ్య…
తెలంగాణలో గ్రూప్-3 అభ్యర్థులకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) కీలక అప్డేట్ అందించింది. నవంబర్ 17 , 18 తేదీల్లో జరగనున్న పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ను కమిషన్ విడుదల చేసింది. పరీక్షలకు వారం రోజుల ముందు హాల్ టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.