Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈరోజు (మంగళవారం) సాయంత్రం హైదరాబాద్ కు వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి తెలంగాణలో ప్రారంభించనున్న కులగణనపై ప్రజలు, మేధావులు, వివిధ సామాజిక వర్గాల వారి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు ఆయన ఇక్కడకు రానున్నారు.
గత పదేళ్లలో విద్యా వ్యవస్థ నిర్లక్ష్యానికి గురైందని, ప్రజా ప్రభుత్వం విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. విద్యార్థులతో సీఎం ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలకు, కళాశాలలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తున్నామన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా జరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఉమ్మడి జిల్లాకో ఐఏఎస్ ను ప్రత్యేక అధికారి గా నియమించింది.
కిషన్ రెడ్డి తెలంగాణ కి ఏం ఇచ్చారో చెప్పండని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. ఇవాళ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రయోజనాల కోసం కిషన్ రెడ్డి టూరిజం నుండి ఏం తెచ్చావు చూపించాలన్నారు.
మాజీ సర్పంచులకు పెండింగ్లో ఉన్న బిల్లులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించాలి అని మెదక్ ఎంపీ రఘునందన్ రావు స్పష్టంగా డిమాండ్ చేశారు. సర్పంచుల సంఘం పలు నెలలుగా పోరాడుతూ ఉన్న పెండింగ్ బిల్లుల మంజూరుపై ప్రెస్ ద్వారా స్పందిస్తూ, వారు చేపట్టిన చలో సెక్రటేరియట్ కార్యక్రమానికి పోలీసులు వ్యతిరేకంగా స్పందించి, అనేక ప్రాంతాలలో మాజీ సర్పంచులను అదుపులోకి తీసుకున్నారని తెలిపారు.
పార్టీలకు, కులాలకు అతీతంగా గ్రామ సభలు పెట్టి అర్హులైన పేదలకు ఇళ్లు నిర్మించే కార్యక్రమం చేపట్టామన్నారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇవాళ ఆయన ఖమ్మం రూరల్ మండలం దానావాయిగూడెంలో మాట్లాడుతూ.. మరో రెండు రోజుల్లో ఇందిరమ్మ ఇళ్ళ ప్రక్రియ మొదలవుతుందని, ఇందిరమ్మ ఇళ్ల కోసం యాప్ ను తయారు చేశామన్నారు.
రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలకు ఎగనామం పెట్టారని, 11 నెలల నుండి మాజీ సర్పంచులకు బిల్లులు రాలేదన్నారు మాజీమంత్రి హరీష్ రావు అన్నారు. సీఎం,పంచాయతీ రాజ్ శాఖా మంత్రికి వినతిపత్రం ఇవ్వాలని సర్పంచులు భావిస్తే దొంగల్లా అరెస్టు చేశారన్నారు హరీష్ రావు.