Hydra Commissioner: కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా ఏర్పాటు తర్వాత అక్రమంగా నిర్మించిన ఇండ్ల పై చర్యలు తప్పవనీ స్పష్టం చేశారు.
Online Betting Suicide: ఈ మధ్యకాలంలో ప్రజలు కష్టపడి పనిచేసే డబ్బులు సంపాదించడం కన్నా అడ్డదారులు తొక్కడం, లేదా బెట్టింగ్ ద్వారా డబ్బులను సంపాదించేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అందులో విజయం సాధిస్తే సరి.. లేకపోతే, చివరకు వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇప్పటికే మనం మీడియా ద్వారా అనేక ఆన్లైన్ బెట్టింగ్ లకు సంబంధించిన అనేక మరణాలను చూసే ఉన్నాము. తాజాగా ఇలాంటి ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలకు…
ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో తెలంగాణ బీజేపీ నాయకత్వం తెగ నానుస్తోందంటూ అసహనం పెరిగిపోతోందట పార్టీ వర్గాల్లో. ఏదైనా నానబెట్టడం వీళ్ళకు అలవాటే కదా.. అంతకు మించి కొత్తగా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాంలే... అన్న పెదవి విరుపులు సైతం పెరుగుతున్నట్టు తెలుస్తోంది. వచ్చే మార్చిలో రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఆ ఎన్నికల్లో పోటీ చేయాలని కూడా డిసైడైంది తెలంగాణ కమలం పార్టీ. ఇంకేముంది... ఫలావాళ్ళు అభ్యర్థులు, ఫలానా ఈక్వేషన్స్‌తో ఎంపిక…
తెలంగాణ ఇంటర్ పరీక్ష తేదీలను ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. మార్చి 5 నుంచి 25 వరకు ఇంటర్ పరీక్షలను నిర్వహించనున్నట్లు బోర్డు వెల్లడించింది. ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి.
లొంగిపోయిన మావోయిస్టులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వరాల జల్లు కురిపించారు. బస్తర్‌లో లొంగిపోయిన మావోయిస్టులకు 15,000 ఇళ్లు కట్టిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు.
Group-2 Exams: తెలంగాణలో గ్రూప్-2 పరీక్షలు తొలిరోజు (ఆదివారం) ప్రశాంతంగా జరిగాయి. మొదటి, రెండో పేపర్లను ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లుగా నిర్వహించగా, సోమవారం మూడు, నాలుగు పేపర్లు నిర్వహిస్తున్నారు. TGPSC జారీ చేసిన గ్రూప్ నోటిఫికేషన్లలో ఇది చివరిది. ఇప్పటికే గ్రూప్-1, గ్రూప్-3 పరీక్షలు పూర్తి కాగా, గ్రూప్-4 ఉద్యోగాలు కూడా భర్తీ అయ్యాయి. Read also: Astrology: డిసెంబర్ 16, సోమవారం దినఫలాలు అధికారులు తొలిరోజు అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత పరీక్ష…
గ్రూప్-2 పరీక్షకు హాజరైన ఓ అభ్యర్థి మొబైల్ ఫోన్‌తో పట్టుబడ్డాడు. ఈ సంఘటన వికారాబాద్‌లోని శ్రీ సాయి డెంటల్ కాలేజ్ పరీక్షా కేంద్రంలో జరిగింది. పరీక్షా ప్రారంభానికి ముందే ఓ అభ్యర్థి ఫోల్డెడ్ మొబైల్ ఫోన్‌ను లో దుస్తుల్లో పెట్టుకుని వచ్చాడు.
Minister Seethakka : వికారాబాద్ జిల్లా కుల్కచర్ల ఆలయ పాలక వర్గం ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం పరిగి ,కుల్కచర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ లతో ప్రమాణ స్వీకారం చేయించారు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీతక్క మాట్లాడుతూ రైతు వ్యవసాయ మానేస్తే కుక్కకు కూడా అన్నం దొరకదని అన్నారు. అదేవిధంగా పేదింటి బిడ్డలు సన్న…