కృష్ణా జలాల వాటాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు చెబుతున్నది పచ్చి అబద్ధం అని తెలంగాణ నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ తేల్చేసారని హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకున్న 34-66 శాతం ఒకే సంవత్సరానికి అని.. క్యాచ్మెంట్ ఏరియా ప్రకారం తెలంగాణకు 71 శాతం నీటి కేటాయింపులు జరగాలని కేసీఆర్ ప్రభుత్వం కృష్ణా ట్రిబ్యునల్‌ను కోరిందని స్పష్టం చేయడం విమర్శలు చేస్తున్న వారి నోళ్ళు మూయించే సమాధానం అని హరీష్ రావు పేర్కొన్నారు.
Read Also: Naga Chaitanya : నాగచైతన్య తర్వాత సినిమా కోసం బాలీవుడ్ విలన్..?
నీటి వాటాలు తేల్చేంత వరకు 50-50 కేటాయించాలని 2015న తెలంగాణ ప్రభుత్వం కోరినట్లు కృష్ణా బోర్డు ముందు తేల్చడం వంటి అంశాలు దాచేస్తే దాగని సత్యాలు అని హరీష్ రావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ పున్వ్యవస్థీకరణ చట్టం 2014లో సెక్షన్ 89 పెట్టి, రాష్ట్రాల బదులు.. ప్రాజెక్టుల ఆధారంగా నీటి పంపిణీ జరిగేలా చేసింది.. కృష్ణా, గోదావరి బోర్డును ఏర్పాటు చేసి తెలంగాణకు అన్యాయం చేసింది ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీనేనని హరీష్ రావు తెలిపారు.
Read Also: Priyanka Chopra: చిలుకూరి బాలాజీ గుడిలో ప్రియాంక చోప్రా