CtrlS AI Data Center: తెలంగాణలో అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డేటా సెంటర్ క్లస్టర్‌ను నెలకొల్పేందుకు కంట్రోల్ఎస్ (CtrlS) డేటా సెంటర్స్ లిమిటెడ్ కంపెనీ అవగాహన ఒప్పందం (MOU)పై సంతకం చేసింది. ఈ ఒప్పందం ప్రస్తుతం దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా కుదిరింది. ఈ ప్రాజెక్టుకు కంట్రోల్ఎస్ సంస్థ రూ. 10,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. 400 మెగా వాట్ల సామర్థ్యంతో ఈ డేటా సెంటర్‌ను తెలంగాణలో నెలకొల్పే ప్రణాళికను రూపొందించింది. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 3,600 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి.
Also Read: MLC Kavitha: పార్టీ కార్యాలయాలపైకి, ఇళ్లపైకి వస్తామంటే భయపడే ప్రసక్తే లేదు
ఈ సమావేశం అనంతరం తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృత్తిలో ఈ డేటా సెంటర్ ఏర్పాటు మరో మైలురాయిగా నిలుస్తుంది’’ అని ఆయన అన్నారు. అలాగే, ‘ఇది ఐటీ సేవల సామర్థ్యాన్ని పెంచుతుందని, ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తుందని ఆయన అన్నారు. ఆ తర్వాత కంట్రోల్ఎస్ సీఈవో శ్రీధర్ పిన్నపురెడ్డి మాట్లాడుతూ.. ‘తెలంగాణలో డేటా సెంటర్ల ఏర్పాటు రాష్ట్రంలోని ఐటీ సేవల ప్రమాణాలను మరింత వృద్ధి చేస్తుందని మేము నమ్ముతున్నామని, తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకోవడం గర్వకరమైన విషయమని ఆయన అన్నారు. ఈ డేటా సెంటర్ ప్రాజెక్టు తెలంగాణలో డిజిటల్ రంగంలో మరిన్ని అవకాశాలను తెచ్చేందుకు, ఐటీ రంగానికి ప్రాధాన్యత ఇవ్వడానికి దోహదం చేస్తుంది.