CM Revanth Reddy: నేడు ప్రధాని మోడీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ!
- ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి
- ప్రధాని మోడీతో భేటీ కానున్న సీఎం రేవంత్
- గత ఏడాది జులైలో ప్రధానితో భేటీ అయిన రేవంత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈరోజు ఉదయం 10.30కు ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం భేటీ కానున్నారు. బీసీ కులగణన రిజర్వేషన్లు, రాష్ట్రంలో పలు ప్రాజెక్టులకు సంబంధించి నిధులపై ప్రధానితో చర్చించనున్నారు. అలానే ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంను పూర్తిస్థాయిలో ప్రధానికి వివరించనున్నారు. ఇటీవల ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై మోడీతో సీఎం రేవంత్ ఫోన్‌లో మాట్లాడిన విషయం తెలిసిందే.
ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అపాయింట్‌మెంట్ సమాచారం రావడంతో.. మంగళవారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. గత ఏడాది జులైలో ప్రధానితో భేటీ అయిన రేవంత్.. దాదాపు 6 నెలల తర్వాత మళ్లీ సమావేశం అవుతున్నారు. నేటి భేటీలో మూసీ సుందరీకరణ, శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మెట్రోరైలు ప్రాజెక్టు, రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లడం లాంటి విషయాలు చర్చించనున్నారు. అలానే విభజన చట్టంలోని వివిధ పెండింగ్ సమస్యలను ప్రధానికి సీఎం విన్నవించనున్నట్లు తెలుస్తోంది.
Also Read
- Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
- Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
- Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను కూడా సీఎం రేవంత్ రెడ్డి కలిసే అవకాశం ఉంది. అలానే కాంగ్రెస్ అగ్ర నేతలను కలసి.. ఎమ్మెల్సీ ఎన్నికలు, పీసీసీ రాష్ట్ర కార్యవర్గం, మంత్రివర్గ విస్తరణపై చర్చించే అవకాశాలున్నాయి. మంగళవారం రాత్రి సీఎం ఢిల్లీ అధికార నివాసంలో రాష్ట్ర అధికారులతో చర్చించారు. సీఎస్, డీజీపీలు ఢిల్లీకి చేరుకున్నారు.
తాజావార్తలు
-
Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
-
Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!