Rain Alert: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ చల్లని ముచ్చట చెప్పింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
NABARD: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నాబార్డ్ చైర్మన్ షాజీ కేవీ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆర్ఐడీఎఫ్ కింద తక్కువ వడ్డీకి రుణాలు అందించాలని నాబార్డు చైర్మన్ ను సీఎం కోరారు. మైక్రో ఇరిగేషన్ కు నిధులు ఇవ్వాలన్నారు.
Cyber Security SP: బెట్టింగ్ యాప్స్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్యపై సరైన క్లారిటీ లేదు అని సైబర్ సెక్యూరిటీ బ్యూరో అడిషనల్ ఎస్సీ ప్రసాద్ అన్నారు. 2017 గేమింగ్ యాక్ట్ ప్రకారం తెలంగాణాలో ఆన్లైన్ గేమింగ్ బ్యాన్ అయింది.
Alleti Maheshwar Reddy: అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టిన బడ్జెట్.. ఇచ్చిన హామీలను పాతరేసేలా ఉందని బీజేపీ శాసన సభాపక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. తెలంగాణ వస్తే బతుకులు మారుతాయని అనుకున్నారు.. కానీ, రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది.. పదేళ్లలో లక్షల కోట్లు అప్పు చేసింది గత ప్రభుత్వం.. గొప్పలకు పోయి గత ప్రభుత్వం నిధులు వృథా చేసింది అని ఆరోపించారు.
Betting Apps : తెలంగాణలో బెట్టింగ్ యాప్ల ప్రచారం విషయంలో దర్యాప్తు వేగవంతమవుతోంది. మియాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు నేపథ్యంలో ఇప్పటికే 25 మందిపై కేసు నమోదు కాగా, ప్రముఖ నటులు రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మి, అనన్య నాగిళ్ళలతో పాటు మరో 20 మంది పై విచారణ కొనసాగుతోంది. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినందుకు బి.ఎన్.ఎస్ లోని 318(4), 112 రెడ్ విత్ 49, తెలంగాణ గేమింగ్ యాక్ట్…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం న్యూ గొల్లగూడెలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తుకు బానిసై డబ్బులు ఇవ్వమని వేధిస్తున్న కొడుకును, తల్లే హత్య చేసిన సంఘటన కలకలం రేపుతోంది. కొడుకు రాజ్ కుమార్ వేధింపులు తట్టుకోలేక తల్లి దూడమ్మ సంచలన నిర్ణయం తీసుకుంది. కొడుకును కాళ్లు కట్టేసి, కొట్టి ఉరివేసి హత్య చేసింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లక్ష్మీదేవిపల్లి ఎస్సై రమణారెడ్డి ఆధ్వర్యంలో విచారణ…
Off The Record: తెలంగాణ అంతా ఒక లెక్క అయితే.. అ నియోజకవర్గంలో ఇంకో లెక్క అన్నట్టుగా ఉందట. ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేను టార్గెట్ చేస్తూ.. అప్పర్ హ్యాండ్ సాధించేందుకు అస్త్ర శస్త్రాలన్నింటినీ వాడేస్తున్నారట ఆ మాజీ ఎమ్మెల్యే. ఇలాగే ఉంటే.. మీకే కష్టమని సొంత పార్టీ నుంచే ఎమ్మెల్యేకి హెచ్చరికలు వెళ్తున్నాయట.
హైదరాబాద్ మెట్రో రైళ్లపై బెట్టింగ్కు సంబంధించిన వాణిజ్య ప్రకటనలు కనిపించడంపై మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పందించారు. ఈ విషయంపై తన దృష్టికి వచ్చిన వెంటనే, తక్షణమే ఆ ప్రకటనలను తొలగించాల్సిందిగా ఎల్అండ్టీ, సంబంధిత యాడ్వర్టైజింగ్ ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. "కొన్ని మెట్రో రైళ్లపై బెట్టింగ్కు సంబంధించిన వాణిజ్య ప్రకటనలు ఉన్నాయన్న అంశం నా దృష్టికి వచ్చింది. ఈ ప్రకటనలను వెంటనే తొలగించాలని సంబంధిత సంస్థలను ఆదేశించాను. ఈ రాత్రికే పూర్తిగా అటువంటి…
Off The Record: తెలంగాణ బీజేపీలో సమన్యాయం జరగడం లేదా? సూపర్ పవర్స్, రెగ్యులర్ పవర్స్ అంటూ వేర్వేరుగా నిర్ణయాలు జరుగుతున్నాయా? రాష్ట్రం మొత్తం జిల్లాల అధ్యక్షుల నియామకాలు పూర్తయినా ఆ రెండు జిల్లాల్లో మాత్రం ఎందుకు పెండింగ్లో పడ్డాయి? అక్కడ అడ్డుపడుతున్న బలమైన శక్తులేవి? ఆ వ్యవహారం పార్టీలో అసంతృప్తికి ఆజ్యం పోస్తోందా?.
Off The Record: ఆ జిల్లాలో బీఆర్ఎస్ ఓటమికి, వాస్తుకు లింక్ ఉందా? వాస్తు దోషం కారణంగానే జిల్లాలో ఒక్క సీటు కూడా పార్టీ గెలవలేకపోయిందా? అందుకే జిల్లా పార్టీ ఆఫీస్ని పాడుబెట్టేశాం... భూత్ బంగ్లాగా మార్చేశామని స్టేట్మెంట్స్ ఇవ్వడంలో లాజిక్ ఉందా?..