హైదరాబాద్‌కు చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి రాజమండ్రి సమీపంలో కొత్త మలుపులు తీసుకుంటోంది. ఈ కేసు ప్రమాదమా? పన్నాగమా? అనే మిస్టరీ మరింత ఆందోళనకు గురి చేస్తోంది. పాస్టర్ ప్రవీణ్ ప్రమాదానికి ముందు 12 సెకండ్ల ముందు ఏం జరిగింది?, ఆ సమయంలో సీసీ కెమెరాల్లో రికార్డయిన విజువల్స్ ఆధారంగా జరిగిన పరిణామాలపై పోలీసుల దృష్టి కేంద్రీకృతమైంది. ఇంతకుముందు బైక్ వెనుక ఐదు వాహనాలు వెళ్లినట్లు సీసీ ఫుటేజ్ రికార్డింగ్ తేల్చగా.. ఈ వాహనాల…
శాసనమండలి ఆవరణలో ‘రైతు రుణమాఫీ’ చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. ఎమ్మెల్సీలు ప్లకార్డులు పట్టుకుని.. రైతు రుణమాఫీ బోగస్ అంటూ నినాదాలు చేశారు. శాసనమండలి మీడియా పాయింట్ వద్ద మండలి ప్రతిపక్ష నేత మధుసూదన చారి, ఎమ్మెల్సీ షేరీ సుభాష్ రెడ్డి మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రైతులకు రుణమాఫీ చేసి దేశానికి ఆదర్శంగా నిలుస్తామని కాంగ్రెస్ చెప్పిందని, అధికారంలోకి వచ్చాక రుణమాఫీని పక్కనపెట్టారని మధుసూదన చారి మండిపడ్డారు. చట్ట సభలు అంటే దేవాలయాలతో సమానం…
పార్టీ మారిన 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో తన నియోజకవర్గం హుజురాబాద్‌లో పంటలు ఎండిపోతున్నాయని మండిపడ్డారు. మంత్రి పొంగులేటికి సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో మీడియా మిత్రులకు సరైన భోజనం కూడా పెట్టలేని ప్రభుత్వం ఇది అని ఎద్దేవా చేశారు. శాసన సభ్యుడుగా తనకే భద్రత లేకపోతే.. సామాన్యుల పరిస్థితి ఏంటి? అని హుజురాబాద్ ఎమ్మెల్యే…
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పరీక్షా పత్రం లీకేజీ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అధికారులు చర్యలు తీసుకుంటున్నా.. లీకేజీలు మాత్రం ఆగడం లేదు. తాజాగా బుధవారం (మార్చి 26) కూడా కామారెడ్డిలో లీకేజీ ఘటన చోటుచేసుకుంది. జుక్కల్ జిల్లా పరిషత్ పాఠశాలలో సిబ్బంది పరీక్షా పత్రంలోని కొన్ని ప్రశ్నలను లీక్ చేశారు. బుధవారం కామారెడ్డి జిల్లాలోని…
భద్రాచలం పట్టణంలో ఓ ఆధ్యాత్మిక సంస్థ నిర్మిస్తున్న ఆరంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిన ఘటన తీవ్ర కలకలం రేపింది. భవనం కింద శిథిలాల్లో ఇంకా ఒకరు మిగిలి ఉన్నారు. బుధవారం సాయంత్రం నుంచి శిథిలాల తొలగింపు చర్యలు ప్రారంభించారు. గత రాత్రి బతికి ఉన్నాడని భావించి కామేష్ అనే మేస్త్రీని బయటికి తీసుకు రావడానికి సింగరేణి రెస్క్యూ బృందం తీవ్రంగా ప్రయత్నం చేసింది. తనను కాపాడాలంటూ ఆర్తనాదాలు చేశాడు. అయితే బయటకు తీసుకొచ్చే సమయానికి అతడు మృతి…
గురువారం ఉదయం 10 గంటలకి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభలో కాగ్ రిపోర్ట్ ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు డీలిమిటేషన్‌పై ప్రభుత్వ తీర్మానంను సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. ప్రభుత్వ తీర్మానం అనంతరం సభలో ద్రవ్య వినిమయ బిల్లు, అవయవ దానం బిల్లులకు ఆమోదం తెలపనున్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. 12వ రోజుతో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. 11 రోజుల పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటలతో…
రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొంతకాలంగా లేడీ అఘోరీగా చలామణి అవుతున్న అలియాస్ అల్లూరి శ్రీనివాస్ తో మంగళగిరికి చెందిన బీటెక్ చదివిన శ్రీవర్షిణి అనే యువతి వెళ్లిపోవటం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈ ఘటనపై అటు హైదారబాద్ లో ఉన్న వనస్థలిపురంలో, గుంటూరు జిల్లా మంగళగిరిలో శ్రీవర్షిని తండ్రి కోటయ్య ఫిర్యాదు చేశాడు.
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అంటే గౌరవం ఉంది.. కానీ, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్ని మాట్లాడొచ్చా అని ప్రశ్నించారు. ఇక, ఓటుకు నోటు దొంగ సీఎం అని అనలేదు.. జడ్చర్ల ఎమ్మెల్యే అన్నాడు 30 శాతం అని.. అలాగే, పీసీసీ పదవిని 50 కోట్ల రూపాయలకు కొన్నాడు అని కోమటిరెడ్డి అన్నారు.. ఇవన్నీ నేను అన్న మాటలు కావు.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు చెప్పిన మాటలే చెప్తున్నాను అని కేటీఆర్ పేర్కొన్నారు.