ఎన్డీఎస్ఏ నివేదికపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ఘటనపై ఒక భాద్యత గల పౌరునిగా మాట్లాడుతున్న.. గత ప్రభుత్వ కక్కుర్తి వల్ల చాలా నష్టం జరిగింది.. కాళేశ్వరం ప్రాజెక్టుపై నిరంతరం అసత్యాలు, అబద్ధాలు ప్రచారం చేసుకున్నారు.. తుమ్మిడిహెట్టి దగ్గర 16 లక్షల ఎకరాల ఆయకట్టుకు రూ. 38 వేల కోట్లతో నాటి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.. కొంత పని కూడా పురోగతిలోకి వచ్చింది.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాణహిత చేవెళ్లకు జాతీయ హోదా ఇవ్వాలంటూ కేంద్రానికి లేఖ రాశారు.. బిఆర్ఎస్ ప్రాజెక్టు రిఇంజనీరింగ్, రిడిజైన్ చేశారు..
Also Read:BJP vs Congress: ‘‘కాంగ్రెస్‌కి పాకిస్తాన్ నుంచి ఆదేశాలు’’.. బీజేపీ విమర్శలు..
తుమ్మిడిహెట్టి దగ్గర రెండు ప్రాజెక్టులు కడతామని, తట్టెడు మట్టిపోయాలేదు.. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ కు నష్టం జరిగింది.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడే బ్యారేజ్ కూలి పోయింది.. కాళేశ్వరం రూ. 85 వేల కోట్లకు అనుమతి తీసుకున్నారు.. ఇరిగేషన్ ప్రాజెక్టులకు లోన్లు ఇవ్వలేదు.. బిఆర్ ఎస్ హయాంలోనే నిర్మాణం జరిగింది, కూలిపోయింది వాళ్ళ హయాంలోనే… ఎన్డీఎస్ఏ రిపోర్టు ఇచ్చింది వాళ్ళ హయాంలోనే.. ప్రాజెక్టులోని లోపాల కారణంగానే కూలిపోయింది అని రిపోర్టులో స్పష్టం చేశారు.. పార్లమెంట్ లో చేసిన చట్టం ద్వారా ఎన్డీఎస్ఏ ఏర్పడింది.. సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి అనవసర మాటలు మాట్లాడుతున్నారు.. రాష్ట్రం మీద దీని వల్ల లక్షన్నర కోట్ల భారం పడుతుంది..
Also Read:Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
16 వేల కోట్లు సంవత్సరానికి వడ్డీ కట్టాల్సి వస్తుంది.. తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టు మార్పే పెద్ద తప్పు. ఎన్డీఎస్ఏను కించపరిచేలా బిఆర్ఎస్ పెద్దలు మాట్లాడం సరికాదు.. పార్లమెంటులో ఎన్డీఎస్ఏ చట్టం చేసినప్పుడు బిఆర్ఎస్ కూడా మద్దతు పలికింది..దేశంలో ని 5700 బ్యారేజ్ లు, ప్రాజెక్టులకు ఏది జరిగిన ఎన్డీఎస్ఏ వెళ్లి పరిశీలించి రిపోర్టు ఇస్తుంది. ఎన్డీఎస్ఏ లో జాతీయ, అంతర్జాతీయ నిపుణులు ఉంటారు. వారే పర్యవేక్షిస్తున్నారు. బిఆర్ఎస్ కంటే ఎన్డీఎస్ఏ కు కొంచెం ఎక్కువ నాలెడ్జ్ ఉందని భావిస్తున్నా.. తుమ్మిడిహెట్టి దగ్గర నీళ్లు లేవని మేడిగడ్డకు మార్చినట్లు పచ్చి అబద్ధాలు చెప్పారు..
Also Read:Pistachio Nuts: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ పెరగాలంటే వీటిని తినాల్సిందే!
వార్ధ దగ్గర కట్టేందుకు ప్రయత్నిస్తే సీడబ్ల్యూసీ ఒప్పుకోలేదు.. ప్రారంభానికి ముందే ప్రాజెక్టులో లోపాలు బయట పడ్డాయి. కానీ బిఆర్ఎస్ వాళ్ళు ఒప్పుకోలేదు.. దీంతో తీవ్ర నష్టం జరిగింది.. ప్రాజెక్టుల్లో 2, 3 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ ఉంచుతారు. కానీ, ప్రాజెక్టుల్లో 14,15 టీఎంసీల నీటిని పబ్లిసిటీ కోసం నీటిని నిల్వ ఉంచారు. ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఎస్ఏకు లేఖ రాశాము.. ఎన్డీఎస్ఏ రిపోర్టు ఇచ్చిన కమిటీలో చాలా అనుభవం కలిగిన వ్యక్తులు ఉన్నారు.
మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోవడంపై 14 నెలలు పరిశీలించి, పరిశోధించి రిపోర్టు ఇచ్చారు.. మేడిగడ్డ లోకేషన్ పెద్ద మిస్టేక్.. అక్టోబర్ 21, 2023న మేడిగడ్డ బ్యారేజ్ కూలింది. అప్పుడు ముఖ్యమంత్రిగా కేసీఆరే ఉన్నారు.. ఎన్డీఎస్ఏ అక్టోబర్ 23న ప్రాజెక్టును పరిశీలించి ఇప్పుడు ఇచ్చిన రిపోర్టునే అప్పుడు ఇచ్చింది.. డ్యామ్ ముందు ఉన్న చెత్తాచెదారంను కూడా ప్రాజెక్టు ప్రారంభోత్సవం రోజు కూడా తొలగించలేదు.. అనేక రంద్రాలు పడ్డాయి. బేసిక్ ఫౌండేషన్ చాలా వీక్ అయ్యింది” అని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు.