కొమరంభీం జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్‌లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అందరికీ నమస్కారం.. బాగున్నారా.. అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. పండిట్ దీన్ దయాళ్ గారి సామాజిక చింతన మాకు ఆదర్శం.. మీ జిల్లాకు రావడం చాలా ఆనందంగా ఉంది నాకు మీ సమస్యలు వినే అవకాశం కలిగింది.. ఎక్కడైతే చీకటి ఉందో అక్కడ దీపం వెలిగించాలి.. గడ్చిరోలి జిల్లాలో ఒకప్పటి పరిస్థితి వేరు కానీ ఇపుడు పరిస్ధితులు మారుతున్నాయి..
Also Read:HIT 3 : హిట్ 3 కలెక్షన్ల సునామీ.. రూ.100 కోట్ల మార్క్ దాటింది గా
పేదవారికి కూడు, గూడు, గుడ్డ అవసరం మేము దానికోసం పని చేస్తాం.. ప్రతి యువకుడు ఉపాధి పొందాలి.. నేను అగ్రికల్చర్ సైన్సులో పని చేసినందుకు 13 డాక్టరేట్ పొందాను.. ఏ ఊరిలో అయితే బావిలో ఒక గంట నీరు వచ్చేదో అదే ఊరిలో ఇపుడు 12 గంటలు నీరు సరఫరా అవుతుంది.. డబ్బులు డిపాజిట్ చేసినట్టు నీరు కూడా డిపాజిట్ చేయవచ్చు.. వాటర్ స్టోరేజ్ సామర్థ్యం పెంచడానికి డ్యాంలలో పూడిక తీశాం.. నేషనల్ హైవే అథారిటీ తరఫున రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆశించకుండా బావుల్లో, చెరువుల్లో పూడిక తీయడానికి మేము సిద్ధంగా ఉన్నాం..
Also Read:HIT 3 : హిట్ 3 కలెక్షన్ల సునామీ.. రూ.100 కోట్ల మార్క్ దాటింది గా
దీని వల్ల రైతులకు లాభం చేకూరుతుంది. నీటి కోసం రైతుల ఆత్మహత్యలు ఆగుతాయి.. నేను ముంబాయిలో మంత్రిగా ఉన్న కాలంలో వాజ్ పెయి గారి ఆదేశంతో గ్రామాలకు కనెక్టివిటీ చేసే కార్యక్రమం నా వయస్సు 33 ఏళ్ళు ఉన్నప్పుడు చేపట్టాను.. ఇదే ఇప్పటి ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన.. తెలంగాణలో రహదారులు బాగు చేసి, ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇస్తున్నాం.. నేను మంత్రిగా బాధ్యతలు తీసుకున్న కొత్తలో 2,511 కిలో మీటర్ ఉండగా ఇపుడు దాదాపు 5000 కిలోమీటర్లు పెంచాం.. తెలంగాణలో ఇంకా 2లక్షల కోట్ల రూపాయల పనులు చేపడతాం.. ఇది ట్రైలర్ మాత్రమే పిక్చర్ ఇంకా మిగిలి ఉంది.
Also Read:Teacher: జుట్లు పట్టుకుని పొట్టు పొట్టు కొట్టుకున్న ప్రభుత్వ టీచర్లు..
తెలంగాణ ఆదివాసీ జిల్లాలైన ములుగు , అదిలాబాద్ జిల్లాలకు కూడా వెళ్లేందుకు జాతీయ రహదారుల కనెక్టివిటీ కలుపుతాం.. రాష్ట్ర అభివృద్ధికి నీరు, ట్రాన్స్పోర్ట్, విద్యుత్, చాలా అవసరం అవి ఉంటే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి.. 17 వేల కోట్ల ఖర్చుతో లక్ష కోట్లతో గ్రీన్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం చేస్తున్నాం.. 4500 కోట్లతో తెలంగాణలో గ్రీన్ వే పనులు ప్రారంభమయ్యాయి.. ఆసియాలో అన్నిటికంటే పెద్ద టన్నెల్ నిర్మాణం చేపడుతున్నాం.. దానికి సంబంధించి పనులు కొంత మేర పూర్తయ్యాయి.. సూరత్ నుంచి నాసిక్, అహ్మద్ నగర్, షోల పూర్ కర్నూలు, హైదరాబాద్ కన్యాకుమారి, కొచ్చి, త్రివేండ్రం బెంగళూర్ లను కలిపేలా గ్రీన్ వే నిర్మాణం చేపడుతున్నాం..
Also Read:YS Jagan: అకాల వర్షాలపై వైఎస్ జగన్ టెలీకాన్ఫరెన్స్.. వైసీపీ నేతలకు కీలక ఆదేశాలు
భిన్నత్వంలో ఏకత్వమే మన ప్రత్యేకత, అలాంటి సంస్కృతులను ఈ గ్రీన్ జాతీయ రహదారులు కలుపుతాయి.. 491 కోట్ల రూపాయలతో అదిలాబాద్ నుంచి బేల పనులు మంజూరు చేశాం.. ఆర్మూర్ జగిత్యాల మంచిర్యాల 5వేల కోట్లతో, 132 కిలోమీటర్ల దూరం జాతీయ రహదారి మంజూరు చేస్తున్నాం.. జగిత్యాల నుంచి కరీంనగర్ జాతీయ రహదారి రాబోయే 3నెలల్లో ప్రారంభం అవుతుంది.. నాగ్ పూర్ నుంచి హైదరబాద్ వరకు 471 కిలోమీటర్ల ఆరు లైన్ల జాతీయ రహదారి నిర్మాణం చేపడుతున్నాం..
Also Read:Samantha : సమంతకు స్టేజ్ పైనే ఐ లవ్ యూ చెప్పిన యంగ్ హీరో..
రైతుల ఖర్చు తగ్గించేందుకు ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ల తయారి కోసం ట్రాక్టర్ ల తయారీ కంపెనీలను కోరాం.. నేను, నా భార్య 7 ఎకరాల్లో వ్యవసాయం చేస్తాం.. నేను స్వయంగా రైతు బిడ్డను.. అందుకే రైతులకు లాభం జరగాలి.. రోడ్లు వస్తె ఉద్యోగాలు వస్తాయి.. ఉపాధి వస్తుంది.. భారత ప్రభుత్వానికి నా వల్ల ఎంత పని అవుతుందో అంత వరకు పని చేస్తాను.. నేను మాటిస్తున్నాను.. తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణాలు మరిన్ని చేపడతాం.. తెలంగాణ ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను అని నితిన్ గడ్కరీ అన్నారు.