India Justice Report : ఇండియా జస్టిస్ రిపోర్ట్-2025 ప్రకారం, దేశవ్యాప్తంగా పోలీస్ విభాగాల పనితీరు ఆధారంగా రాష్ట్రాల ర్యాంకింగ్లో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానాన్ని సాధించింది. 32 సూచికల ఆధారంగా ఈ మదింపు జరిగింది, ఇందులో రాష్ట్రాలను రెండు వర్గాలుగా విభజించారు: 10 మిలియన్లకు పైగా జనాభా కలిగిన 18 పెద్ద రాష్ట్రాలు మరియు 10 మిలియన్ల లోపు జనాభా కలిగిన 7 చిన్న రాష్ట్రాలు. తెలంగాణ, పెద్ద రాష్ట్రాల విభాగంలో 6.48 పాయింట్లతో మొదటి స్థానంలో…
Kaleshwaram Pushkaralu : తెలంగాణ సెక్రటేరియట్లో ఒక చారిత్రక కార్యక్రమం జరిగింది. కాళేశ్వరంలో జరగనున్న సరస్వతి నదీ పుష్కరాల కోసం అధికారిక వెబ్సైట్, మొబైల్ యాప్, వాల్ పోస్టర్లను మంత్రులు కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం పుష్కరాల ఏర్పాట్లలో ప్రభుత్వం చూపిస్తున్న శ్రద్ధను స్పష్టం చేసింది. మే 15 నుంచి 25 వరకు జరగనున్న ఈ పుష్కరాల కోసం ప్రభుత్వం రూ. 35 కోట్లను కేటాయించి, భక్తులకు అన్ని సౌకర్యాలను కల్పించేందుకు…
ఈ రోజు రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన కు బయల్దేరనున్నారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, రాష్ట్ర అధికారుల ప్రతినిధి బృందం సీఎం వెంట వెళ్లనున్నారు. ఏప్రిల్ 16 నుంచి 22 వరకు తెలంగాణ ప్రతినిధుల బృందం జపాన్ లో పర్యటించనుంది. టోక్యో, మౌంట్ ఫుజి, ఓసాకా, హీరోషిమా లో ముఖ్యమంత్రి బృందం పర్యటించనుంది. ఓసాకా వరల్డ్ ఎక్స్పో 2025లో తెలంగాణ పెవిలియన్ ను ప్రారంభిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆ…
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారం, లావాదేవీలకు సంబంధించిన సమాచారం రైతులకు, ప్రజలకు మరింత సులభంగా, వేగంగా అందుబాటులో ఉండే విధంగా భూ భారతి పోర్టల్ ను తీసుకొచ్చింది. ఈ పోర్టల్ ను ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రైతులకు అర్థమయ్యేలా సులభమైన భాషలో భూ భారతి పోర్టల్ రూపొందించింది తెలంగాణ ప్రభుత్వం. వెబ్ సైట్తో పాటు యాప్ను పటిష్టంగా నిర్వహించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. సీఎం రేవంత్ మాట్లాడుతూ.. “పండగ వాతావరణంలో భూ…
కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ సమావేశం అయ్యారు. కలెక్టర్ల పనితీరుపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ లకు సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ఇంకా చాలా మంది రెగ్యులర్ వర్క్ షీట్ పంపడం లేదు.. క్షేత్ర స్థాయికి వెళ్ళడం లేదు.. పని తీరు మార్చుకోవడం లేదు.. అలాంటి వాళ్ళు.. సీఎస్ నీ కలిసి మేము గ్రౌండ్ వర్క్ చేయలేం అని రిపోర్ట్ చేయండి ఏసీ కింద పని…
గత కొన్ని నెలలుగా లేడీ అఘోరి వ్యవహారం హాట్ టాపిక్ గానే ఉంటోంది. సనాతన ధర్మం, దేశ రక్షణ, మహిళల రక్షణ కోసం పాటుపడుతున్నానంటూ.. తనపై ఎదురుతిరిగిన వారిపట్ల దురుసుగా ప్రవర్తిస్తూ హల్ చల్ చేస్తోంది. తాజాగా లేడీ అఘోరీకి సంబంధించిన మోసం వెలుగుచూసింది. అఘోరీ లీలలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. తాజాగా అఘోరీపై కేసు నమోదైంది. సైబరాబాద్ మొకిలా పోలీస్ స్టేషన్ లో ఫిబ్రవరి 25 న ఎఫ్ఐఆర్ నమోదైంది. ఓ బాధితురాలి పిర్యాదు మేరకు పోలీసులు…
ప్రజావాణి పై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 2023 డిసెంబర్ నుంచి ఇప్పటివరకు 117 సార్లు ప్రజావాణి నిర్వహించామని అధికారులు తెలిపారు. ప్రజావాణిలో 54,619 అర్జీలు ప్రజలు నమోదు చేసుకున్నారు. వీటిలో 68.4% (37384) అర్జీలు పరిష్కారమయ్యాయి. ప్రజావాణి అర్జీలను పరిష్కరించేందుకు మరింత పారదర్శకమైన విధానాలు అమలు చేయాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. ప్రజావాణి డ్యాష్ బోర్డు యాక్సెస్ ను తనకు అందించాలని సీఎం కోరారు. లైవ్ యాక్సెస్…
సంసారాల్లో చిన్న చిన్న గొడవలు రావడం సర్వ సాధారణం. కానీ నేటి రోజుల్లో చిన్న గొడవలే దారుణాలకు దారితీస్తున్నాయి. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, భార్యా భర్తల మధ్య చోటుచేసుకుంటున్న మనస్పర్ధలు, ఒకరిపై ఒకరు పెత్తనం చెలాయించడం, పరాయి వ్యక్తులపై మోజు ఇలాంటి కారణాలు భార్యాభర్తల మధ్య చిచ్చుపెడుతున్నాయి. దీని కారణంగా చావడమో లేదా చంపడమో చేస్తున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. పటాన్ చెరు (మం) పెద్ద కంజర్ల గ్రామంలో దారుణ ఘటన…